తెలంగాణాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కోవిడ్ 19 కట్టడి కోసం చేసిన ప్రయత్నాలు.. ఇపుడు ఫలితాలు కనిపిస్తున్నాయి అని తెలంగాణా డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణా లో కోవిడ్ వాక్సినేషన్ సక్సెస్ అయింది అని ఆయన పేర్కొన్నారు. గాంధీలో క్రిష్ణమ్మ, నార్సింగ్ లో జయమ్మ తొలి టీకా వేసుకున్నారు అని ఆయన తెలిపారు. వాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ అందరికి రోల్ మోడల్స్ అని ఆయన పేర్కొన్నారు.

వాక్సిన్ పూర్తి సేఫ్ అని తేలిపోయింది అని వెల్లడించారు. 20 మందికి టీకా వేసుకున్న చోట ఎర్రబడింది.. ఇది సమస్య కాదు అని అన్నారు. వాక్సిన్ వేసుకున్న వాళ్ళ ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. రేపు వాక్సినేషన్ కు సెలవు అని అన్నారు. వాక్సిన్ వేసుకున్న వాళ్ళు.. కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. ప్రయివేట్ ఆస్పత్రుల వాళ్లకు వచ్చేవారంలో టీకా వేస్తాం అని ఆయన తెలిపారు.  ఈ రోజు తెలంగాణా లో 3530 మంది వాక్సిన్ తీసుకున్నారు అని అన్నారు.

ఇదిలా ఉంటే సంగారెడ్డి జిల్లాలోని లోని ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో సంగీత అనే ఏఎన్ఎంకు స్వల్ప అస్వస్థత వచ్చింది. కోవిడ్ టీకా తీసుకున్న వెంటనే తల తిప్పుతుందన్న సంగీత... వాంతులు చేసుకోవడంతో ట్రీట్మెంట్ చేసారు. ఆసుపత్రి సిబ్బంది  బీపీ చెక్ చేసారు. సపర్యలు చేసి బెడ్ పై పడుకోబెట్టారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి మాట్లాడుతూ... ఏఎన్ఎం సంగీత పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది అని ఆయన అన్నారు. టీకా వలన సంగీతకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు అని తెలిపారు. సంగీతకు టెన్షన్ వలన అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంది  అని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: