ఆంధ్రప్రదేశ్ లో
స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా
రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి... ఎన్నికల కమీషనర్ ని టార్గెట్ గా చేసుకుని... ఎన్నికల అధికారులకు వార్నింగ్ లు ఇచ్చారు. ఎకగ్రీవాలను గనుక ప్రకటించకపోతే అధికారుల అంతు చూస్తాను అంటూ ఆయన ప్రకటించారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలకు దిగింది.
మంత్రి బయటకు రాకుండా చూడాలని మీడియాతో మాట్లాడకుండా ఉండాలని నిమ్మగడ్డ రమేష్
కుమార్ ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఆదేశాలు అమలు చేయాలని డీజీపీకి స్పష్టంగా చెప్పారు. దీనితో
మంత్రి పెద్దిరెడ్డి...
హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. దీనిపై నేడు మధ్యాహ్నం విచారణ జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్
కుమార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పెద్దిరెడ్డి
హౌస్ అరెస్ట్ పై ఆదేశాలు చెల్లవని
హైకోర్ట్ తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది.
మంత్రి ఇంటి నుంచి బయటకు రావడమే కాకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అని ఎన్నికల సంఘం చెప్తూ కొన్ని ఆంక్షలు విధించింది.
దీనితో ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ
మంత్రి హైకోర్టుకు వెళ్ళగా... ఉదయం నుంచి ఇరు పక్షాల వాదనలు విన్న
హైకోర్ట్ మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు ఇచ్చింది. ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని మాత్రమే సమర్ధించిన హైకోర్ట్...
మంత్రి మీడియాతో మాట్లాడేందుకు వీల్లేదని ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ... ఎన్నికల అంశాలకు సంబంధించి ఏ విషయాలనూ మీడియాతో మాట్లాడకూడదని తెలిపింది. అయితే తాను మీడియాతో మాట్లాడను అని నిన్ననే
మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక మంత్రిపై తీసుకున్న చర్యలను
కేంద్ర ప్రభుత్వ దృష్టికి రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకు వెళ్ళింది. ఇక ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం ఆదేశాలు తాను పాటిస్తా అని
మంత్రి చెప్పారు.