ఇంద్రకీలాద్రి పై మరో వివాదం వెలుగులోకి వచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్ వర్సెస్   దుర్గగుడి అధికారులు  పాలకమండలి సభ్యులుగా వివాదం నడుస్తుంది. సెక్యురిటీ, పూల కాంట్రాక్ట్, సరుకులు, శానిటేషన్,  ఇతరత్రా కాంట్రాక్టుల ఫైళ్లను టెండర్ల ప్రక్రియ అనంతరం కమిషనర్ కు దుర్గగుడి అధికారులు పంపించారు. దేవాదాయ శాఖ నుంచి క్లియరెన్స్ రాలేదు. పాలక మండలి ఆమోదంతో బిల్లుల క్లియరెన్స్ అయింది. ఎసిబి అధికారుల సోదాల్లో దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. బిల్లుల చెల్లింపులు, విధుల్లో అలసత్వం పై 16 మంది పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది సర్కార్.

మ్యాక్స్ సెక్యురిటీ సంస్ధకు ఆర్డర్స్ లేకుండా కట్టబెట్టారని సస్పెన్షన్ ఆర్డర్ లో దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ నుంచి అప్రూవల్ రాకపోతే పనులు చేపించుకొని డబ్బులు చెల్లించొద్దా అని చైర్మన్  నిలదీశారు. కమిషనర్ కు పంపినా దేవాదాయ శాఖ నుంచి సంవత్సరం అయినా రిప్లై రాలేదని చైర్మన్ పైలా‌ సోమినాయుడు పేర్కొన్నారు. మూడు సింహాల చోరి సమయంలో దేవస్ధానం వేసిన కమిటీ రిపోర్ట్ కోసం ఎస్టాబ్లిష్ మెంట్ డిపార్ట్ మెంట్ కి మరోసారి ఎసిబి అధికారులు  వెళ్ళారు.

దుర్గగుడి అధికారుల నుంచి రిపోర్ట్ సేకరించి సంతకాలు తీసుకెళ్లిన ఎసిబి అధికారులు... ఎలాంటి నివేదిక సమర్పించారో అనే ఆవేదన ఉంది. మరెంతమంది పై వేటు పడుతోందనే ఆందోళనలో దుర్గగుడి అధికారులు ఉన్నారు.  ఇక పశ్చిమనియోజకవర్గం కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న  టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కీలక వ్యాఖ్యలు చేసారు. దుర్గగుడిలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఎసీబీ తనిఖీల్లో తేలింది అని అన్నారు. 13మంది సిబ్బందిని సస్పెండ్ చేసినా.. ఇఓ ను రక్షిస్తున్నారు అని ఆరోపించారు. దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యత వహించి వెల్లంపల్లి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసారు. కార్పోరేషన్ ఎన్నికలలో వైసీపీని ఓడించి అమరావతి రాజధాని ఇక్కడే అని చాటి చెప్పాలి అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: