మనకు తెలిసినంత వరకు కోయిలలు పాటలు పడుతాయని విన్నాము. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ పులి పాట పాడింది. అవునండి ఇది నిజం. చందమామ కథలో అని అనుకుంటున్నారా.. కాదు నమ్మండి ఇది నిజమే. అయితే ఎక్కడన్నా పాడుతుందా? ఇదేంటి విచిత్రం అనే అనుకుంటున్నారు కాదు. రష్యాలోని ఒక జూకు వెళితే ఎంతో చక్కగా పాట పాడే పులి కనిపిస్తుంది. అది పాడే సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీని రాగం విని అక్కడికి వచ్చినవారు ఆశ్చర్యపోతున్నారు. సైబీరియన్ నగరంలోని బర్నాల్‌లో లెస్నాయ స్కజ్కా పేరుతో ఒక ప్రాచీన జూ పార్క్ ఉన్నది.

ఇక షేర్‌ఖాన్‌ ద్వారా బగీరా అనే ఈ ఆడ పులి 2020 జూన్‌లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అముర్ అనే ఎనిమిది నెలల పులి పిల్ల ఇటీవల వింతగా గాండ్రించడం మొదలు పెట్టింది. దాని అరుపు పాడుతున్నట్లుగా చాలా శ్రావ్యంగా ఉంది.  ముందుగా ఇది గమనించిన జూ నిర్వాహాకులు ఆశ్చర్య పోయారు. జూ సిబ్బంది ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆ పులి గొంతుకకు ఏమైనా గాయం అయ్యిందా అని అనుమానించి పరిశీలించారు.



అయితే అది ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకున్నారు.ఇది ఎదో పొరపాటు అని అనుకున్నారు. తర్వాత కాని తెలియలేదు. అది నిజంగానే పాడుతోందని.. ఆ తర్వాత నిర్దారించుకున్నారు. కేవలం తన తల్లి దృష్టిని ఆకట్టుకునేందుకు ఆ పులి పిల్ల ఈ విధంగా శ్రావ్యంగా అరుస్తున్నదని గ్రహించారు. ఇది చాలా అరుదైన విషయమని జూ సిబ్బంది తెలిపారు. ఇక ఇప్పటి వరకు ఆడ పక్షులను ఆకట్టుకునేందుకు మగ పక్షులు గొంతు మార్చి ఆలపించడం విన్నాం… కాని ఇప్పుడు ఒక పులి తన తన తల్లిని ఆకట్టుకునేందు చేస్తున్న ప్రయత్నం అంటే వింతేగా.. కాగా, పాడుతున్న మాదిరిగా, కూనిరాగం తీస్తున్నట్లుగా ఉన్న ఆ పులి అరుపు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయ్యింది. ఈ పాట అమ్మ కోసం

మరింత సమాచారం తెలుసుకోండి: