సమాజంలో ఎన్నో దారుణాలు, యువత వికృత చేష్టలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. మానసిక వత్తిడి వల్లో లేదా సమాజం మీదు విరక్తి చెందో కొంతమంది యువత పెడదారి పడుతున్నారు. అందులో కొంత మంది ఉగ్రవాదం వైపు మళ్లుతుంటే సొసైటీలో ఉంటూ మరికొంత మంది ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు.

వీరి వల్ల అభం శుభం తెలియని అమాయకులు బలైపోతున్నారు. అమెరికాలో ఇలాంటి ఉన్మాదులు మరీ రెచ్చిపోతున్నారు. ఎంతో మంది అమాయకులను బలి తీసుకుంటున్నారు. అమెరికాలో ఓ వ్యక్తి ఉన్మాదంతో రెచ్చిపోయి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోగా, ఆ తర్వాత అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టైరోన్ పట్టణానికి చెందిన ఒక ఉన్మాది ఈ కాల్పులు జరిపాడు.

ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల్లో 9 మందిని కాల్చి చంపి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పులు జరిపిన అనుమానితుడి మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన వాహనంలో నిందితుడి మృతదేహాన్ని, నాలుగు ఇళ్లలో బాధితుల మృతదేహాలను కనుగొన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఏదేమైనా ఉన్మాదులగా మారడానికి కారణం సమాజమో లేక తను ఉండే పరిసర ప్రాంతాల వల్లో ముందే గుర్తించి వారికి మానసిక వైద్యం ఇప్పిస్తే ఇలాంటి దారుణాలు జరగవని మానసిక నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: