
నిధుల వేటలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరోవైపు ఓవర్డ్రాఫ్టు కూడా పరిమితి మించుతోంది. ఇదే సమయంలో పబ్లిక్ డిపాజిట్ల ఖాతాల్లో ఉన్న నగదును కూడా విత్డ్రా చేసి ఇతర ఖాతాల్లోకి మళ్లించేరదుకు ఆర్తిక శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన ఆర్ధికసాయం కోసం ఢిల్లీకి వెళ్లారు. అక్కడి పెద్దలను కలుసుకుని వివిధ పద్దుల కింద రావాల్సిన నిధులను రాబట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానంగా 13వ ఆర్ధిక సంఘం ద్వారా రావాల్సిన దాదాపు 1300 కోట్లు, రాజధాని నిధులు, పోలవరం నిధులు, ఆర్ధిక లోటు నిధులపై ప్రయత్నాలు ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఆర్ధిక సంవత్సరం ముగింపునకు చేరుకున్న నేపథ్యంలో కనీసం 3000 కోట్ల రూపాయలైనా రాబట్టుకోవాలని ఆయన భావిస్తు న్నారు.
అయితే రాష్ట్రంలో ఓవర్డ్రాఫ్టు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యరలో కేంద్రం ఎరతవరకు సహకరిస్తుందన్నది వేచి చూడాలి. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా 2500 కోట్ల రూపాయల ఓవర్డ్రాఫ్టుకు వెళ్లిపోగా, నెలాఖరుకు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు చేరిపోతుందని ఒక అంచనా. మూడు రోజులుగా అధికారులతో ఇదే అంశంపై విస్తృతంగా చర్చిస్తున్న చంద్రబాబు ఓవర్డ్రాఫ్ట్పై తేలిగ్గా తీసుకురటూనే... బిల్లుల చెల్లింపుల్లో మాత్రం జాప్యంవద్దని ఆర్ధికశాఖకు స్పష్టం చేసినట్లు సమాచారం. చంద్రబాబు సింగపూర్ వెళ్లొచ్చాక మరోసారి కేంద్రంలోని పెద్దలతో బేటీ కానున్నారు.
చంద్రబాబు తన విదేశీ పర్యటనలకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారని.. జాలీ ట్రిప్ లా వెళ్తున్నారని విమర్శలు వస్తుండగా.. అవి జాలీ ట్రిప్ లు కాదని.. జోలె యాత్రలని మరికొందరు అంటున్నారు.