శవాలను పీక్కుతిన్న యువకుడు వినడానికి వింతగా ఉంది.. ఆ మాట వింటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.. కానీ ఇది నిజం.. అదేంటో పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం..ఒళ్లు గగొర్పొడిచే దారుణ ఘటనతో మహారాష్ట్రంలోని సతారా జిల్లాలో చోటు చేసుకుంది. స్మశానంలో కరోనాతో చనిపోయినవారి శవాలను పీక్కుని తింటున్న ఓ యువకుడిని చూసిన స్థానికులు హడలిపోయారు. వివరాల్లోకి వెళ్లితే.. ఓయువకుడు స్మశానంలో సగం కాలిన కరోనా శవాలను తింటున్నాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వార్త విన్న పోలీసులకు కూడా షాక్ అయ్యారు.
ఒకసారి ఇది నిజమా కాదా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.. కానీ గ్రామస్తులు చెప్పిన విధానాన్ని చూసిన వారు అక్కడకు చేరుకున్నారు. వాళ్ళ శబ్దానికి ఆ యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు. అదే విషయాన్ని గ్రామస్తులు చెప్పేసరికి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.కానీ, అప్పటికే గ్రామస్థుల అలికిడి విన్న సదరు యువకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. స్మశాన వాటికలో తిరుగుతూ సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను తింటున్నాడని అధికారులు అక్కడి చేరుకునే లోపే అతడు పరారయ్యాడు. కానీ గ్రామస్తులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం కొంతమందిని తీసుకుని సదరు యువకుడి కోసం గాలించగా సాయంత్రానికి దొరికాడు.
అతన్ని పోలీసులు వారి స్టైల్లో ప్రశ్నించారు. కానీ ఆ యువకుడు ఏదేదో చెప్తూ.. పిచ్చిగా ప్రవర్తించాడు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై మునిసిపల్ కార్పొరేషన్ చీఫ్
ప్రసాద్ కట్కర్ మాట్లాడుతూ..అతని ఊరుగానీ, పేరుగానీ చెప్పటంలేదనీ..ఎటువంటి వివరాలు చెప్పడం లేదని తెలిపారు. మతిస్థిమితం లేక మృతదేహాలను తిని ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. అతనికి వైద్యం అందించి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.. ఎది ఏమైనా కూడా పోలీసులు తెలిపిన ఈ వివరాలు మాత్రం మనుషులకు విరక్తి కలిగించాయి.. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా అదే మాట వినపడుతుంది.