బొగ్గు గనుల కార్మికుల శ్రమను గుర్తించేందుకు ప్రతియేటా మే 4న కోల్ మైనర్స్ డే జరుపుకుంటారు. ఈ రోజు వారి త్యాగాలు, విజయాలను గౌరవించడం తోపాటు దేశానికి విద్యుత్ అందించేందుకు పడే వారి కష్టాలను కూడా గుర్తిస్తాం. పాతాళం నుంచి భూతలానికి బొగ్గును తెచ్చి దేశంలో వెలుగులు నింపుతున్న కార్మికుల బాధలు వర్ణనాతీతం. ప్రతిరోజూ వందల, వేల అడుగుల లోతున్న గుహలలోకి వెళ్లి చిమ్మచీకట్లో గనుల తవ్వతూ ప్రజల అవసరాల నిమిత్తం బొగ్గును భూమి పైకి తేవడం అనేది అత్యంత కష్టమైన, ప్రమాదకరమైన పని. గనులు తవ్వుతూ చనిపోయిన కార్మికులు ఎందరో ఉన్నారు.


1774 లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన జాన్ సమ్నర్, సుటోనియస్ గ్రాంట్ హెల్తీ దామోదర్ నది వెంబడి ఉన్న రాణిగంజ్ కోల్‌ఫీల్డ్‌లో బొగ్గును దొంగలించడం ప్రారంభించినప్పుడు ఇండియాలో బొగ్గు తవ్వకం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కార్మికులు లక్షల టన్నుల బొగ్గును తవ్వి తీస్తున్నారు. ఐతే ఈ బొగ్గును కోట్ల రూపాయలకు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. సహజ బొగ్గు సంపదకు కొలువైన సింగరేణి 1928లో ఏర్పాటయింది. ఇది భారత దేశంలోనే ఉత్తమ కోల్ మైన్స్ గా పేరుగాంచింది. అయితే తొమ్మిది దశాబ్దాల కాలంలో ఎంతోమంది సింగరేణి కార్మికులు డ్యూటీ లోనే మరణించారు.



మైనింగ్ ఉద్యోగాలు చేసే వారి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. జీవితాంతం బాధించే అత్యంత సీరియస్ హెల్త్ కండిషన్స్ కూడా తలెత్తుతాయి. కానీ కార్మికులు ఇవేమీ లెక్కచేయకుండా దేశానికి బొగ్గు అందించేందుకు పాటుపడుతూనే ఉన్నారు. పారిశ్రామిక విప్లవం సమయంలో బొగ్గు గనుల కార్మికుల యొక్క శ్రమకి అత్యంత ప్రాధాన్యత దక్కింది. ప్రపంచంలో అత్యధిక బొగ్గు గనుల సంపద ఉన్న దేశాలలో ఇండియా మూడవ స్థానం సంపాదించుకుంది. ఇండియాలో శిలాజ ఇందనమైన బొగ్గు సమృద్ధిగా లభిస్తుంది. ఆ బొగ్గును గనుల నుంచి వెలికి తీయడానికి కార్మికులు ఎంతో కష్టపడుతుంటారు. కోల్ మైనింగ్ చేయడం అనేది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పనిగా అభివర్ణిస్తుంటారు. అందువల్ల బొగ్గు గనుల కార్మికులకు ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: