
ఇలా రోజు రోజుకు కరోనా సెకండ్ విజృంభిస్తు అందరిలో ప్రాణ భయానికి కలిగిస్తూ ఉంటే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైరస్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నాయ్. ఇలాంటి తరుణం లోనే ఇక ప్రజలందరినీ మరింత భయాందోళనకు గురి చేసినందుకు కరోనా వైరస్ మూడవ దశ కూడా ఉంటుంది అంటూ వార్తలు వస్తూ ఉండడం అందరినీ బెంబేలెత్తిస్తోంది. త్వరలోనే భారత్లో కరోనా వైరస్ మూడవదశ ఉండే అవకాశం ఉంది అంటూ ఎంతో మంది వైద్య నిపుణులు కూడా చెబుతూ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
అయితే ఇప్పటికే కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో అల్లాడిపోతూ థర్డ్ వేవ్ వస్తుందేమో అని భయభ్రాంతులకు గురి అవుతుంటే ఇటీవలే మధ్యప్రదేశ్ మంత్రి ఉష ఠాకూర్ బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారు. యజ్ఞం నిర్వహిస్తే ఇక పూర్తిగా పర్యావరణం శుద్ధి అయి థర్డ్ వేవ్ అపాయం నుంచి తప్పించుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి వ్యాఖ్యలు కాస్త ఎంతో చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇప్పటికే కరోనా తో ప్రజలందరూ బెంబేలెత్తిపోతు ఉంటే ఇక మంత్రి ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ అందరూ విమర్శలు చేస్తున్నారు.