భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది.  ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో ఎప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతూ ఉంటుంది పాకిస్తాన్  ఈ క్రమంలోనే భారత్ కూడా అప్రమత్తం అయ్యి ఎదురు దాడికి దిగుతుంది. ఇలా భారత్ పాకిస్తాన్ సరిహద్దు లో ప్రతి క్షణం ఒక మినీ యుద్ధమే జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ఇక ఇప్పుడు భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్ లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఓ వైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి మరి అక్కడ ఆయుధాలను మోహరిస్తుంది పాకిస్తాన్. అదే సమయంలో అటు భారత్ కూడా సరిహద్దుల్లో భారీగా ఆయుధాలను మోహరించడమే కాదు ప్రజలందరికీ రక్షణ కల్పించేందుకు వివిధ రకాల చర్యలు చేపడుతోంది.



 ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ సైన్యం భారీ మోహరింపు లతోపాటు ఇక ఉగ్రవాదులు కూడా దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా ఆగస్టులో ఇలాంటి పరిణామాలు ఎక్కువగా ఉంటాయి.  ఈ క్రమంలోనే మొహరింపులు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ మొహరింపుల నేపథ్యంలో అటు భారత్ కూడా అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు ఇస్తోంది భారత్. అటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నివసించే ప్రజలందరికీ రక్షణ కల్పించేందుకు మోటార్ షెల్స్  నుంచి రక్షణ కల్పించేందుకు భూగర్భం బంకర్ల నిర్మాణ పూర్తయిన నేపథ్యంలో..  ఇక వాటి గురించి అటు అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేయడమే కాదు.. ఎలా రక్షణ పొందవచ్చు అన్న విషయాన్ని ఒక మాక్ డ్రిల్ రూపంలో భారత సైన్యం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.



 ఇలా ఇరువైపులా భారీగా మోహరింపులు జరుగుతూ ఉండటం ఇక అక్కడి ప్రజలను కూడా ఖాళీ చేయిస్తూ ఉండడంతో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది  సాధారణంగానే పాకిస్తాన్ భారత్ సరిహద్దు ప్రాంతంలో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి  ఇక ఇప్పుడు భారీగా మొహరింపులు జరగడంతో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఈ మొహరింపులు ఎక్కడ వరకు దారితీస్తాయి అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: