డిమాండ్‌కు అనుకూలంగా పంటలు పండిస్తే రైతుకు నష్టం ఉండదు. కానీ.. చాలా మంది రైతులకు పంటలు పండించడమే తెలుసు.. మార్కెట్ గురించి పెద్దగా ఆలోచించరు. తాతల నుంచి సంప్రదాయంగా వస్తున్న పంటలే పండిస్తారు. కొత్తమార్గాల వైపు వెళ్లరు. ఆ కారణంగా నష్టాలపాలవుతుంటారు. ఇప్పుడిప్పుడే రైతులు కొత్త పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు.

అలాంటి వారికి సర్పగంధ మొక్కల పెంపకం కాసులు కురిపిస్తోంది. ఈ పంటకు తక్కువ ఖర్చుతో అధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ సర్పగంధ పంట ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దీనిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. సర్పగంధను 400 ఏళ్లుగా భారతదేశంలో ఏదో ఒక రూపంలో సాగు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

సర్పగంధ సాగులో అనేక రకాలు ఉన్నాయి. అంటుకట్టుటం, విత్తడం ద్వారా మొక్కలు పెంచుతారు.  నర్సరీలో మొక్కలో 4 నుంచి 6 ఆకులు కనిపించినప్పుడు, అప్పుడు వాటిని సిద్ధం చేసిన పొలంలో పండిస్తారు. ఒకసారి నాటిన తరువాత సర్పగంధ మొక్కలను పొలంలో ఉంచుతారు. అందువల్ల క్షేత్రాన్ని బాగా సిద్ధం చేయాలి. పొలంలో సేంద్రియ ఎరువును కలుపుకుంటే పంట పెరుగుదల మెరుగుపడుతుంది.

ఇంతకీ ఈ సర్పగంధ ఎందుకు వాడతారో తెలుసా.. పిచ్చితనం, ఉన్మాదం వంటి వ్యాధుల నిర్ధారణలో దీనిని ఉపయోగిస్తారు. పాము, ఇతర క్రిమి కాటుకు విరుగుడు మందు తయారీలోనూ ఉపయోగిస్తారు. మొక్క పుష్పించిన తరువాత అది పండ్లు వస్తాయి. ఆ విత్తనాలను వారానికి రెండుసార్లు తీసుకుంటారు. ఒక మొక్క ద్వారా 30 నెలలపాటు పంట తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పంట ద్వారా రైతులు ఒక ఎకరానికి సులభంగా నాలుగు లక్షల రూపాయలు సంపాదించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పంట గురించి మరింతగా నిపుణుల ద్వారా వివరాలు తెలుసుకుని.. తెలుగు రైతులు కూడా పండిస్తే మంచి లాభాలు గడించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: