ప్రస్తుతం ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  కస్టమర్ల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ దూసుకుపోతుంది. కస్టమర్లకు అందించే సేవల విషయంలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతో కచ్చితత్వంతో ఉంటుంది. ఎప్పటికప్పుడు వినూత్న మైన సేవలను  అందిస్తూ ఉంటుంది.  అంతే కాదు కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా వివిధ రకాల స్కీమ్ లను కూడా అందిస్తోంది. ఇక తమ కస్టమర్ల కోసం స్టేట్ బ్యాంక్ ఒక అదిరిపోయే స్కీమ్ సిద్ధం చేసింది. ఇక ఇందులో చేరారు అంటే ప్రతినెల 10,000 రూపాయలు పొందేందుకు అవకాశం ఉంటుంది.



అదే ఎస్ బి ఐ యాన్యూటీ స్కీమ్. ఇక ఇందులో చేరిన కస్టమర్లకు నిర్దిష్ట కాలం పాటు ప్రతి నెల డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుంది  ఇక ఈ స్కీమ్ లో నాలుగు రకాల టెన్యూర్ లు అందుబాటులో ఉన్నాయి.. 36 నెలలు, 60 నెలలు ,ఎనభై నాలుగు నెలలు, 124 ఇక వీటిల్లో కస్టమర్ తమకు నచ్చిన ఆప్షన్ ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక మీరు ఎంచుకున్న టెన్యూర్ కాలాన్ని బట్టి మీకు వడ్డీ రేటు లభిస్తూ ఉంటుంది. ఇక మీరు కాలపరిమితి ఎంచుకుని ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది



 ఇక స్కీమ్ యొక్క కాలపరిమితి పై వడ్డీ రేట్ల ప్రకారం ప్రతి నెలా వడ్డీ డబ్బులు పొందవచ్చు. ఇక వడ్డీ రేట్లు ఎలా ఉంటే అంత మొత్తంలో రాబడి లభిస్తోంది. అయితే ఈ స్కీం లో ఎంత డబ్బులు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి కూడా ఏమీ లేదు.  ఇక సీనియర్ సిటిజన్స్ ఇక ఈ స్కీం లో చేరితే మరింత బెనిఫిట్ లభించనుంది. వారికి అదనంగా వడ్డీ లభిస్తోంది. స్కీమ్ లో చేరి ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు ఆ తర్వాత ప్రతి నెల డబ్బులు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: