శ్రీలంక క్రికెట్ టూర్ కోసం యువ భారత టీమ్ ను పంపించడంపై ఆ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది తమ క్రికెట్ ను అవమానించడమేనన్నాడు. శిఖర్ ధావన్ స్టాండిన్ కెప్టెన్ గా సెకండ్ రేట్ ఇండియన్ టీమ్ పర్యటనకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డును అనాలన్నాడు. కేవలం టీవీ మార్కెటింగ్ కోసమే ఓకే చెప్పారని రణతుంగా మండిపడ్డాడు. శ్రీలంక బోర్డును ప్రక్షాళన చేయాలన్నాడు.

శ్రీలంక టూర్‌కి ఇటీవల 20 మందితో ఇండియన్ టీమ్ ను ప్రకటించారు. ఇప్పటికే ప్రధాన క్రికెటర్లతో కూడిన ఇండియన్ టీమ్  ఇంగ్లండ్ టూర్ కు వెళ్లింది. శ్రీలంకకు సెలక్ట్ చేసిన జట్టులో ఐపీఎల్ 2021 సీజన్‌లో టాలెంట్ చూపించిన ఆరుమంది యువ క్రికెటర్లకి తొలిసారి సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఈ బృందానికి కెప్టెన్‌గా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సెలక్ట్ అయ్యాడు.  ఈ జట్టు ఈ  నెల 13 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లను శ్రీలంకతో ఆడనుంది.

శ్రీలంక టూర్ లో ఉండే భారత జట్టు సభ్యులు వీళ్లే. శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యుజ్వేందర్ చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా ఉన్నారు.

జులై 13న కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఆ తర్వాత 16న సెకండ్ వన్డే, 18న చివరి వన్డే జరగనుంది. తర్వాత జులై 21న ఫస్ట్ టీ20, 23, 25న చివరి రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. సిరీస్‌లోని ఆరు మ్యాచ్‌లూ కొలంబో వేదికగానే జరగనుండటం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: