బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర విభజన తర్వాత నదీ జలాల వివాదంతో రాజకీయ లబ్ధి పొందాలని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు అని విమర్శించారు. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ వల్ల రాయలసీమ నీటి సమస్యలు తీరుతాయనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు. రాయలసీమ నీటి సమస్య, కరువును అడ్డంపెట్టుకొని చాలా మంది రాజకీయ లబ్ధి పొందారు అని విమర్శించారు.

తుంగభద్ర నదిపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడరు అని రాయలసీమ ఎత్తిపోతల పథకం...రాయలసీమ కోసం నిర్మించడం లేదు అని మండిపడ్డారు. రాయలసీమ  ఎత్తిపోతల పథకం నుంచి 80 వేల క్యూసెక్కులు నీటిని ఎక్కడికి తీసుకెల్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు. రాయలసీమ  ఎత్తిపోతల పథకం అనేది ఓట్లు సీట్ల కోసమే అన్నట్టుగా ఉంది అని విమర్శించారు. రాయలసీమ  ఎత్తిపోతల పథకం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ కే ఎసరొస్తుంది అన్నారు ఆయన.

రాయలసీమలోని ప్రాజెక్టుల నిర్మాణం, కాంట్రాక్టర్ల అక్రమా లపై ప్రభుత్వం అధ్యయనం చేయాలి  అని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్, క్రాక్ లు, లీకేజీల వల్ల డ్యామ్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మోసాలను కేంద్రం అన్ని గమనిస్తోంది అని పేర్కొన్నారు. తుంగభద్ర వరద జలాలు రాయలసీమకు ఇవ్వాలి అని సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టు 854 అడుగులు మెయింటెనెన్స్ చేస్తేనే రాయల సీమ బతికేది  అన్నారు ఆయన.

రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల సీమకు నష్టం వాటిల్లనుంది అని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పవర్ ముఖ్యం కాదు.. రాయల సీమకు నీళ్లు ముఖ్యం అని స్పష్టం చేసారు. అమరావతిలో స్కిప్టు రెడీ చేసి పంపిస్తే షర్మిల చదువుతోంది అని విమర్శించారు. క్రిష్ణా రివర్ వ్యాలీ ద్వారా నీటి సమస్యలను తెలుసుకునే అవకాశం కల్పించాలి అని కోరారు. రాయలసీమను ప్రధాని మోది దత్తత తీసుకోవాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp