ఈ ఏజెన్సీ సంస్థల నుండి విఐపి కేటగిరీ లో భద్రతను పొందాలంటే వారు రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి ప్రముఖులు మరియు క్రీడాకారులు అయి ఉండాలి. ఈ విధంగా భద్రతను పొందే వారిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీం కోర్ట్ మరియు హై కోర్ట్ జస్టిస్, గవర్నర్, ముఖ్యమంత్రులు, మినిస్టర్స్ మరియు భారత్ సైనిక అధిపతులు కూడా భద్రతను పొందేందుకు అర్హులవుతారు. ఈ భద్రతను కల్పించడానికి ఎలా మరియు ఎవరు నిర్ణయిస్తారో తెలుసా ? దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిట ఉంటుంది. ఈ కమిటీలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, హోమ్ సెక్రటరీ మరియు హోమ్ మినిస్టర్ లు ఉంటారు.
కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా సిపారసు చేసిన భద్రతను కల్పిస్తారు. అయితే ఈ భద్రతలలో కూడా కొన్ని విభగాలు ఉంటాయి. ఇందులో X Y Z మరియు Z + అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ఇందులో మన దేశంలోని ప్రధానమైన వ్యక్తులకు Z + భద్రతను కల్పిస్తారు. మరియు ఈ భద్రతను ప్రత్యేక భద్రత విభాగం అందిస్తుంది. ఇక Y కేటగిరీ లో ఇద్దరు ప్రధాన అధికారులు మరియు 11 మంది స్టాఫ్ ఉంటారు.
Z వర్గం లో మొత్తం 22 మందితో కూడిన భద్రతా స్టాఫ్, ఢిల్లీ నుండి పోలీసు సిబ్బంది, సి ఆర్ పి ఎఫ్ జవాన్ తో ఒక కారు ఉంటుంది. ఇందులో రక్షణ అత్యంత పటిష్టంగా ఉంటుంది.
వీటన్నింటి కన్నా Z+ వర్గంలో అందించే భద్రత టాప్ క్లాస్ అని చెప్పాలి. ఈ విభాగంలో ఉన్న స్టాఫ్ కొత్త ఆయుధాలతో మొత్తం 36 మంది స్టాఫ్ ఉంటారు. ఈ భద్రతను పొందే వారు వ్యక్తిగత భద్రతను కూడా పొందే అర్హతను కలిగి ఉంటారు. ఈ స్థాయిలో 28 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు, ఒక ఎస్కార్ట్, ఒక పైలట్ మరియు టైలింగ్ వాహనాలు, కోబ్రా కమాండోలు మరియు 12 మంది హోంగార్డులు రక్షణ కల్పిస్తారు.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి... ఎస్ పి జి రక్షణను పొందే వారి కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. వారిలో ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అటల్ బిహారి వాజ్ పేయీ, సోనియా, రాహుల్ మరియు ప్రియాంక వాద్రాలు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి