తొమ్మిదేళ్ల అత్యాచార బాధితురాలి కుటుంబానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసినందుకు గానూ కాంగ్రెస్ పార్టీ అధికార ట్విట్టర్ ఖాతా మరియు అనేక మంది నాయకుల అకౌంట్లు తాత్కాలికంగా ట్విట్టర్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగుతుంది దీనిపై కాంగ్రెస్ కీలక నేతలు ట్విట్టర్ పై అలాగే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వేచ్చను హరిస్తుంది అని కాంగ్రెస్ కీలక నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రణదీప్ సింగ్ సూర్జేవాలా, అజయ్ మాకెన్, సుస్మితా దేవ్ మరియు మాణిక్కం ఠాగూర్ ఖాతాలు తాత్కాలికంగా లాక్ చేసారని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ రోహన్ గుప్తా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీనిపై ట్విట్టర్ అధికారికంగా ఒక ప్రకటన చేసింది. దీనిని కాంగ్రెస్ తమ  పార్టీ అధికారిక హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తమ ఖాతా లాక్ చేయబడిందని చెప్తూ ట్విట్టర్ మెసేజ్  స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసింది.

"కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ ఇండియా లాక్ చేసింది. మోదీ జీ, మీరు ఎందుకు  భయపడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ మన దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడింది, సత్యం, అహింస & ప్రజల అభీష్టం కోసం మాత్రమె కాంగ్రెస్ పని చేసింది. మేము అప్పుడు గెలిచాము, మేము మళ్లీ గెలుస్తాము, ”అని స్క్రీన్‌షాట్ కింద క్యాప్షన్ పోస్ట్ చేసింది. దాదాపుగా 5 వేల మంది ట్విట్టర్ ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసారు. ఇక అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ కలిసి వారికి ధైర్యం చెప్పారు. దీనిపై కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: