ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ నారా లోకేశ్ మరో సారి షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి గాలి జగన్ రెడ్డి నిర్వాసితులను మోసం చేశారని నిప్పులు చెరిగారు నారా లోకేశ్. ఇవాళ పోలవరం ముంపు బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ... 10 లక్షలు ఇచ్చాడా ? భూమికి భూమి ఇచ్చాడా ? అని నిలదీశారు నారా లోకేష్‌.
అందరికీ  ముద్దులు పెట్టి... జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని నిప్పులు చెరిగారు.

 
తప్పులు ప్రశ్నిస్తే జైలు లో పెడుతున్నాడని...మండి పడ్డారు.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం  లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి లో ఏపీ ముఖ్య మంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ఉన్నాడని ఫైర్‌ అయ్యారు.  వరద సహాయం 2500 ఇవ్వలేని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి పది లక్షలు ఎలా ఇస్తాడని నిలదీశారు.  వైసీపీ పార్టీ  కుక్కల్ని ప్రశ్నిస్తున్నా సీబీఐ విచారణ కు సిద్దమా ? అని సవాల్‌ విసిరారు నారా లోకేష్.  

తండ్రి విగ్రహాలకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నాడని జగన్‌ పై ఫైర్‌ అయ్యారు.   కేంద్ర ప్రభుత్వం  పోలవరం నిర్వాసితుల కోసం ఇచ్చిన నాలుగు వేల కోట్లు తినేశాడని జగన్‌ మోహన్‌ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్‌. గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని అధికారులు కటిక నేలపై కూర్చోబెట్టి అవమానించారని ఫైర్‌ అయ్యారు.   అందరం కలిసి పోరాడితే మూర్ఖత్వపు ప్రభుత్వాన్ని దించవచ్చని ప్రజలను కోరారు.  అరకు ఎంపీ ఏ రోజైనా పార్లమెంట్ లో పోలవరం కోసం మాట్లాడారా ? అని ప్రశ్నించారు.   పోలవరం నిర్వాసితుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు నారా లోకేష్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: