బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5 వ రోజు పాద యాత్ర కొనసాగిస్తున్నారు. 5వ రోజు కనకమామిడి నుండి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర... ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగింది. పోలాల్లోకి వెళ్లి రైతులతో ముచ్చటించిన సంజయ్... రైతుల వెతలు చూసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఏ ఊరు వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి... ఎవరిని కదిలించినా కష్టాలు మొరపెట్టుకున్నారు అని అన్నారు. పంటకు గిట్టుబాటు ధర లేదని రైతుల వెతలు ఒకవైపు, వయసు దాటిపోతున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగుల బాధలు కనపడుతున్నాయని విమర్శించారు.

వెట్టి చాకిరి చేస్తున్నా జీతాలు రావడం లేదని కార్మికుల కష్టాలు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వారి బాధలను ఓపిగ్గా విన్న సంజయ్... రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ హయాంలో తమకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని దారిపొడవునా రైతులు, కార్మికులు, నిరుద్యోగులు గోడు వెళ్లబోసుకున్నారని బండి సంజయ్ తెలిపారు. తొలుత కనకమామిడి చౌరస్తా నుండి మొదలైన పాదయాత్ర అప్పిరెడ్డి గూడ, తోల్కట్ట, ముడిమ్యాల, పల్గుట్ట, కందాడ స్టేజ్ మీదుగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు మల్కాపూర్ చేరుకుందని బిజెపి వర్గాలు తెలిపాయి.

కేసీఆర్ వన్నీ ఝూటా మాటలే అని ఆరోపించారు. కొందరు కూలీలతో బండి సంజయ్ ముచ్చటించారు. తమకు డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని వారు మొరపెట్టుకున్నారు అని బండి పేర్కొన్నారు. అదే సమయంలో రోడ్ పై ఆగిన లారీ డ్రైవర్లతో సంజయ్ మాట్లాడగా వారి కష్టాలు బండి సంజయ్ కు వివరించారు. ఇక దారిలో తోల్కట్ట సమీపంలోని గులాబీ పూల తోటలోకి వెళ్లిన బండి సంజయ్ రైతులతో కలిసి కలుపు మొక్కలు తీశారు. రైతులపక్షాన బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ వారికి హామీ ఇచ్చారు.  అప్పిరెడ్డిగూడలో బండి సంజయ్ ను నరసింహతోపాటు పలువురు పారిశుధ్య కార్మికులు కలిసి గ్రామ పంచాయితీలో చెత్తను తీస్తూ రాత్రింబవళ్లు వెట్టిచాకిరి చేస్తున్నా 3 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని బండి సంజయ్ కు వివరించారు.గతంలో జగన్ కూడా తన పాదయాత్రలో ఇదే విధంగా ముందుకు వెళ్ళిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: