ఎనిమిదేళ్ల వయసు.. కానీ అతనికి మోయలేని భారం వచ్చి పడింది.. ఆడి పడాల్సిన వయసులో కుటుంబ భారం మొత్తం మోయాల్సిన పరిస్థితి వచ్చింది.  ఎనిమిదేళ్ల వయసు కు అతనికి ఏం అర్థమైందో ఏమో ఇక కుటుంబం కోసం పని చేయడం మొదలుపెట్టాడు.  తోటి స్నేహితులు అందరూ ఎంతో ఆనందంగా ఆటలు ఆడుతూ ఉంటే ఇక ఎనిమిదేళ్ల బాలుడు మాత్రం ఆనందంగా ఇంటి బాధ్యతలు మోస్తున్నాడు.  పాపం అతనికి ఎంత కష్టం వచ్చింది అనుకున్న వాళ్ళు తప్ప అతనికి సహాయం చేసిన వాళ్లు మాత్రం ఒక్కరూ లేరు.  ఇక కుటుంబ పోషణ కోసం ఎనిమిదేళ్ల బాలుడు ఆటో నడుపుతున్న ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 ప్రస్తుతం బ్యాటరీ ఆటో నడుపుతూ రయ్యి రయ్యి మంటూ దూసుకుపోతున్నాడు ఎనిమిదేళ్ల బుడతడు. చిత్తూరు జిల్లాకు చంద్రగిరి మండలంకు చెందిన  పాపిరెడ్డి, రేవతి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కానీ ఆ దంపతులిద్దరికి కళ్ళు కనిపించవు. అయితే తల్లిదండ్రులు ఇద్దరు అందులు కావడంతో కుటుంబ పోషణ రోజురోజుకు భారంగా మారి పోతుంది. ఈ క్రమంలోనే ఈ దంపతుల పెద్ద కొడుకు అయినా గోపాల్ రెడ్డి కుటుంబ బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.



 ఎనిమిదేళ్ళ వయసులో ఆ బాలుడికి ఏం అర్థం అయిందో ఏమో ఏకంగా ఎంతో గొప్పగా ఆలోచించాడు. రోజు రోజుకు కుటుంబ పోషణ భారం అవుతూ ఉండడంతో ఇక చిన్న ప్రాయంలోనే మోయలేనని కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు  బ్యాటరీ ఆటో నడుపుతూ గ్రామంలో పప్పులు బియ్యం విక్రయించడం మొదలుపెట్టాడు. కానీ ఈ చిన్న పిల్లాడు ఇక ఆటో నడుపుతుంటే స్థానికులు భయపడిపోతున్నారు  ఆటో నడిపే క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని..  స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: