ష‌ర్మిల‌కూ జ‌గ‌న్ కూ మ‌ధ్య రాజ‌కీయ వైరుధ్యాలు లేకున్నా ఆస్తి తంటాలు మాత్రం ఉన్నాయి. ఇవే త‌ప్పిదాలుగా మార‌నున్నా యి. అన్న‌పై ష‌ర్మిల చేసే పోరుకు ఓ విధంగా ఇవే కీ రోల్ కానున్నాయి. ఇడుపుల పాయ ఎస్టేట్ ఎవ‌రిది అన్న‌ది ఎప్పుడో  వైఎస్ త‌న వీలునామాలో రాసినా ఇంకా కొన్ని వివాదాల‌పై స్ప‌ష్ట‌త రాలేదు. అవే కాకుండా కొన్ని ఉమ్మ‌డి ఆస్తులు ష‌ర్మిల‌, జ‌గ‌న్ కు ఉన్నాయి. ఇవి  కూడా విభేదాల‌కు కార‌ణం అయి త్వ‌ర‌లో వైఎస్సార్టీపీ అధినేత్రి కోర్టు ముఖంగా అయినా పోరాడ‌వ‌చ్చు.


సాక్షిలో ఓన‌ర్ షిప్ త‌గాదా మొద‌లైంది. ష‌ర్మిల ఆస్తి త‌గాదాల‌ను నెత్తి పెట్టుకుని మోస్తున్నార‌ని, ఇవేవీ జ‌గ‌న్ కు న‌చ్చ‌వ‌ని తెలు స్తోంది. కానీ పార్టీని, ఛానెల్ ను రెంటినీ త‌న గుప్పిట పెట్టుకుని రాజ‌కీయం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ష‌ర్మిల ఉన్నారు. త్వ‌ర‌లో సా క్షి ఛానెల్ విష‌య‌మై కూడా ష‌ర్మిల చెప్పే ఆర్థిక సంబంధ లావాదేవీలు మీడియా ముఖంగా బ‌య‌ట‌ప‌డ‌డం కూడా ఖాయం. వైఎ స్సార్టీపీకి అనుకున్నంత హైప్ రాని కార‌ణంగా ష‌ర్మిల కుటుంబంలో పూర్తిగా అసంతృప్త‌త ఉంది. ఎలా అయినా ఆర్థిక త‌గాదాలు తేల్చుకోవాల‌ని, కొన్ని వాటాల విష‌య‌మై ఏదో ఒక స్ప‌ష్ట‌త‌కు రావాల‌ని ష‌ర్మిల భావించ‌డ‌మే కాదు అందుకు త‌గ్గ ప్ర‌తిపాద‌న‌లు సైతం అన్న ద‌గ్గ‌ర‌కు పంపార‌ని స‌మాచారం.  


వైఎస్ కుటుంబంలో క‌ల‌హాలు లేవు అని చెప్ప‌డంలో అస్స‌లు వాస్త‌వం లేద‌ని కొన్ని పరిణామాలే చెప్ప‌క‌నే చెబుతాయి. అయిన ప్పటికీ కుటుంబం మొత్తం ఒకే గూటి కింద ఉంద‌ని చాలా మంది భావించేందుకు వీలుండేలా రాజ‌కీయం న‌డుపుతున్నార‌ని, కొం ద‌రు పైకి విమ‌ర్శించినా కూడా అవేవీ ప‌ట్టించుకోకుండా ష‌ర్మిల - జ‌గ‌న్ ముందుకు పోతున్నారు. వైఎస్సార్టీపీ ఏర్పాటు అయ్యాక ఫ్యామి లీలో విభేదాలు ఉన్నాయ‌ని ఎన్ని సార్లు వారు లేవ‌ని చెప్పినా అవ‌న్నీ అంగీకారం కాద‌ని కొన్ని సంద‌ర్భాలే చెప్పాయి. ముఖ్యంగా జ‌గ‌న్ త‌న‌కు ప‌ద‌వి ఇవ్వ‌లేద‌న్న అక్క‌సు ష‌ర్మిల‌కు ఉంది అని, ఆమెకు ప‌దవి ద‌క్కక‌పోవ‌డంతో విజ‌య‌మ్మ కూడా మౌనం అయి పోయార‌ని, కానీ లోప‌ల అంత‌ర్మ‌థ‌నం అలానే ఉంది అని ప‌లువురు ప‌రిశీల‌కులు అంటున్నారు. విభేదాల నేప‌థ్యం లోనే వైఎస్ వ‌ర్ధంతి కార్య‌క్రమం విజయ‌మ్మ నేతృత్వం లో జ‌రిగినా జ‌గ‌న్ వెళ్ల‌లేదు అని, వాస్తవానికి అది ఒక ప్ర‌యివేటు స‌భ అ యితే జ‌గ‌న్ ఎందుకు వెళ్ల‌ర‌ని ప‌లువురు సందేహాలు వెల్ల‌డించారు. ఇవి ఎలా ఉన్నా జ‌గ‌న్ ను కొన్ని ప‌ట్టిపీడిస్తున్నాయి. ష‌ర్మిల త‌గువు కార‌ణంగా కుటుంబంలో ఆర్థిక వివాదాలు రాజుకున్నాయి. వీటికి ఊతం ఇచ్చే విధంగా ష‌ర్మిల ఇటీవ‌ల మాట్లాడారు.

తాను సాక్షికి కో ఓన‌ర్ ను అని చెప్పారు. అందులో త‌న‌కూ వాటాలున్నాయ‌న్న అర్థం ధ్వ‌నించేలా మాట్లాడారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఆర్థిక లావా దేవీల‌పై  కూడా త‌గువులు వ‌చ్చాయ‌న్న‌ది సుస్ప‌ష్టం. కొన్ని త‌గాదాల కార‌ణంగానే మొన్న‌టి వైఎస్ వ‌ర్ధంతి కూడా జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య ఎడ‌మొహం, పెడ‌మొహం అన్న‌విధంగానే సాగింది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా అన్న నిల‌దొక్కుకు కునేందుకు తాను స‌హ‌క‌రించినా త‌న‌ను మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌న్న కోపంతోనే ష‌ర్మిల పార్టీ పెట్టారు. అదేవిధంగా అన్న‌పై పంతం నెగ్గాల‌న్న కోరిక‌లోనే ఉన్నారు. ఇందుకు ప్ర‌శాంత్ కిశోర్ సాయంతో తెలంగాణ‌లో నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నాలు చే స్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

ap