తెలుగుదేశం పార్టీ కోసం ఎంతమంది సీరియస్‌గా కష్టపడుతున్నారు? ఎంతమంది పైకి హడావిడి చేస్తూ, పార్టీని ఏదో పైకి లేపుతున్నామని బిల్డప్ ఇస్తున్నారు? అంటే 2019 ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితం అయిన దగ్గర నుంచి ఆ పార్టీకి అండగా ఉండే నాయకులు చాలా తక్కువైపోయారు. అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన నేతలు, అధికారం కోల్పోయాక సైడ్ అయిపోయారు.

ఇక ఉన్నవారిలో కొందరేమో జగన్ ప్రభుత్వానికి భయపడి పెద్దగా బయటకొచ్చి పోరాడలేకపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నారు. అలాగే పార్టీకి నిత్యం అండగా ఉండటానికే ప్రయత్నిస్తున్నారు. అయితే పార్టీ కోసం ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారో తాజాగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఎన్నికల్ని టి‌డి‌పి బహిష్కరించింది.

కానీ కింది స్థాయిలో ఉన్న క్యాడర్ మాత్రం ఎలాగైనా పోటీ చేయాలని చెప్పి బరిలో దిగింది. ఆ క్యాడర్‌కు పైనున్న నాయకులు పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం నేతలు, తమ కార్యకర్తలకు బాగానే సపోర్ట్ ఇచ్చారు. కొన్నిచోట్ల గుడ్డి మీద మెల్ల బెటర్ అనే విధంగా ఫలితాలు రాబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు టి‌డి‌పి నేతలు కాస్త కష్టపడి పార్టీని గెలిపించుకోగలిగారు. అలా పార్టీని గెలిపించుకున్నవారిలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్‌లు ఉన్నారు.

ఈ ఇద్దరు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో పర్వాలేదనిపించేలా ఫలితాలు రాబట్టుకున్నారు. జెడ్‌పి‌టి‌సి స్థానాలు కోల్పోయినా సరే...చింతమనేని సొంత నియోజకవర్గం దెందులూరులో 74 ఎం‌పి‌టి‌సి స్థానాలకు టి‌డి‌పి 10 చోట్ల గెలిచింది. అటు నిమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లులో 41 ఎం‌పి‌టి‌సి స్థానాలు ఉంటే టి‌డి‌పి 11 చోట్ల గెలిచింది. అటు ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, జనసేనతో పొత్తు పెట్టుకుని టి‌డి‌పిని గెలిపించుకున్నారు. మొత్తానికి ఈ నాయకులు పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారని అర్ధమవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp