ప్రాంతీయ తీవ్రవాదం అంటే నక్సలిజం. వీళ్లు బడుగు బలహీన వర్గాల కు జరిగే అన్యాయాలను సహించలేక ఆయుధాలతో వాటిని సరిచేయొచ్చనే భావనతో అడవుల బాట పడతారు. అయితే ఒంట్లో ఓపిక తగ్గొ లేక ఈ విధమైన పోరాటంతో తాము అనుకున్నది సాదించలేమనే స్పృహ రావటంతో మళ్ళీ జనారణ్యంలో కలిసిపోతారు. వీళ్ల కు పొలిసు అధికారులకు అనేక సార్లు అనేక విధాలుగా ఎన్నో పోరాటాలు జరిగాయి. అందులో అటు అధికారులు, ఇటు నక్సల్స్ కూడా ఎందరో మృత్యువాత పడ్డారు. ప్రతీకారం అంటూ మళ్ళీ ఈ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.  ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ తుపాకులు కూడా పేలుతూనే ఉన్నాయి. ఎక్కడో కొందరు మాత్రం ఇందులో ఇమడలేక ప్రజలలో కలిసిపోవాలని ఇటువంటి దళాల నుండి బయటకు వస్తుండటం కూడా అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం.

మరి ఇస్లామిక్ స్టేట్ లాంటి భయంకరమైన తీవ్రవాద సంస్థల నుండి కూడా బయటకు వచ్చిన వారు ఉన్నారా.. ఉంటె వాళ్ళను బ్రతకానిస్తున్నారా.. అలా బయటకు వచ్చిన కారణాలు ఏమిటి.. వాళ్ళను ప్రజలు ఎలా స్వాగతించారు.. ఇలాంటి ప్రశ్నలు వస్తుండటం  సహజమే. తాజాగా అలాంటి మహిళ తనకు మరో అవకాశం ఇస్తే తీవ్రవాదం పై పోరాడటానికి సాయపడతాను అంటుంది. ఇటువంటి భయంకరమైన తీవ్రవాద సంస్థలో భాగం అయినందుకు జీవితాంతం పశ్చాత్తాప్పడుతున్నట్టు ఆమె తెలిపారు. మరో అవకాశం ఇస్తే బ్రిటన్ ప్రభుత్వానికి ఉగ్రవాదం పై పోరాడటానికి సాయం చేస్తాను అంటుంది ఆమె.

మరో అవకాశం ఇస్తే తాను ప్రజలకు ఉపయోగపడతానని, సిరియా లాంటి శిబిరాలలో మగ్గిపోతూ ఉండటం భరించలేనని  ఆమె అంటున్నారు. కేవలం 22ఏళ్లకే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో మెరుగైన పాత్ర పోషించినట్టు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఆమె పై వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమే అని, అందుకే అవకాశం ఇస్తే నిరూపించుకుంటానని అంటున్నారు. ఐఎస్ కోసం పనిచేసినందుకు ఈమె పౌరసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. బంగ్లా మూలాలు ఉన్న బ్రిటన్ పౌరురాలు షామియా బేగం. ఆమె పదిహేనవ ఏట స్నేహితులతో కలిసి సిరియా పారిపోయింది. అక్కడ అందరూ ఐఎస్ లో చేరి శిక్షణ పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: