కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనసేన టిడిపి పార్టీలు బరిలో నుంచి తప్పుకున్న ఆ పార్టీల మద్దతు బీజేపీ అభ్యర్థి సురేష్ కి ఇవ్వడంపై చర్చ జరుగుతుంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి  డా. సుధాను బలపరుస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైసిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం చేస్తున్నారు. బద్వేలు నియోజకవర్గంలో స్టార్ కంపెయిన్ చేస్తూ ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు బిజెపి అధ్యక్షుడు  సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం కొనసాగుతోంది. స్థానిక టిడిపి, జనసేన నాయకులతో మంతనాలు జరుపుతూ బిజెపి అభ్యర్థి సురేష్ ను బలపరచాలని చర్చలు చేస్తున్నారు. రేపటితో ప్రచార గడువు ముగియనుంది. మరోవైపు పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

రేపు సాయంత్రం 7 గంటల నుంచి కూడా  సభలు గాని, మైకులు గాని ఎటువంటి ప్రచారం చేయకూడదని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వైసీపీకీ చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో వారి విధి విధానాలేంటి, వారు ఏ విదంగా అభివృద్ధి చేయదల్చుకున్నారో స్పష్టంగా వైసిపి అధిష్టానం చెప్పింది. దీనికితోడు బిజెపి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు త్రిముఖపోటీకి తెర లేపుతున్న బద్వేల్ ఉపఎన్నిక కేవలం బీజేపీ వర్సెస్ వైసిపి లాగానే వాదోపవాదాలు చేస్తూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు  సోము వీర్రాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రధానంగా మీరు పులివెందుల, కడప జిల్లాలోనే అభివృద్ధి చేసుకుంటున్నారని వారన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల అడ్డాగా ఉన్న పులివెందులను మాత్రమే చూపిస్తున్నారని మిగతా నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం లేదని వారన్నారు.

కనీసం కడప జిల్లాలో వెనుకబడినటువంటి బద్వేల్ నియోజకవర్గాన్ని కూడా ఇప్పటి వరకు తారు రోడ్లు లేవు, తాగడానికి నీటి వసతి లేదు అని సోము వీర్రాజు మండిపడ్డారు. రెండు ప్రధాన పార్టీలకు ఈరోజు, రేపు చాలా కీలకమని చెప్పవచ్చు. ప్రధానంగా బీజేపీ అధిష్టానం గల్లీ నుంచి ఢిల్లీ నాయకులను పిలిపించి బద్వేల్ లోని ప్రతి ఒక్క వీధిన, ప్రతి ఒక్క గడపన ఇంటింటి ప్రచారం చేసింది. తమ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: