టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గత సాధారణ ఎన్నికల నుంచి ఎదురవుతున్న ఘోర పరాజయాల పరంపర లో తాజాగా మరో ఘోర పరాజయం ఎదురైంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడం ఒక ఎత్తు అయితే... మొత్తం 25 వార్డులకు కేవలం ఆరు వార్డు ల్లో మాత్రమే గెలిచి... ఘోరంగా పరువు పోగొట్టుకొంది. ఇక గత ఎన్నికల్లో చంద్రబాబు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఆపసోపాలు పడ్డారు. కేవలం 30 వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారు. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో  వైసీపీ ఏకంగా 95 శాతం స్థానాలను గెలుచుకుంది.

ఇక ఇప్పుడు కోపం మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ తన సత్తా చాటుకుంది. దీంతో చంద్రబాబు కు కుప్పంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి .  వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఆయన కుప్పం ను వదిలిపెట్టే స్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఆయనకు త‌న సొంత నియోజ‌క‌వ వ‌ర్గం అయిన కుప్పం నుంచి కాకుండా తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కృష్ణ , గుంటూరు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.

చివ‌రి అస్త్రం గా కుప్పంలో ప‌ట్టు నిలుపు కునేందుకు చంద్ర‌బాబు తో పాటు ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ సైతం గ‌ట్టిగా ప్ర‌చారం చేశారు. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించి ప‌ట్టు నిలుపు కోవాల‌ని అనుకున్నారు. అయితే ఆ ఆఖ‌రి అస్త్రాలు కూడా ఫ‌లించ లేదు. దీంతో ఇప్పుడు కుప్పం కంచు కోట కాస్త కూలిపోయిన‌ట్ల‌య్యింది. ఏదేమైనా బాబు కు కుప్పం మ‌రీ అంత సేఫ్ ప్లేస్ అయితే కాద‌ని తేలిపోయింది. ఇప్పుడు లోకేష్‌, బాబు ఇద్ద‌రూ కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు వెతుక్కోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: