తీవ్ర ప్ర‌కృతి విపత్తులు ఆంధ్రావ‌నిని సంక్షోభంలో నెడుతున్నాయి. విప‌రీతంగా చోటుచేసుకుంటున్న వాతావ‌ర‌ణ మార్పులు కార‌ణంగానే భారీ వ‌ర్షాలు పుట్టి ముంచుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయి ఉన్నాయి. చాలా ప్రాంతాలు అత‌లాకుత‌లం అయి ఉన్నాయి. అయినా కూడా విప‌త్తు నిర్వ‌హ‌ణ అన్న‌ది స‌జావుగా సాగ‌డం లేదు. అదేవిధంగా లోత‌ట్టు ప్రాంతాలు అన్న‌వి పూర్తిగా అత‌లాకుత‌లం అయి ఉన్నాయి. ఇవేవీ ప‌ట్టించుకోకుండా అసెంబ్లీ స‌మావేశాలు సాగుతున్నాయి.


వానొచ్చి ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అయిపోతున్న‌రు. అస‌లు వానా వరదా రెండూ కూడా జ‌నాల‌ను క‌దిపి కుదిపి కుదేలు చేస్తున్న యి. ఇంత క‌ష్టంలోనూ ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వాల‌కు ఏదీ ప‌ట్ట‌దు. మాట్లాడాల్సినంత మాట్లాడ‌రు. చేయాల్సినంత చేయ‌రు. వాన‌తో రాష్ట్రం అంతా అత‌లాకుత‌లం అయిపోతోంది. వానతో జ‌నం తిండి లేక అల్లాడుతున్నారు. ఇళ్ల‌లోకి  నీరు చేరి కాల‌నీలు కాల‌నీలు ప్రాణాలు బిగ‌పట్టుకుని బ‌తుకుతున్నాయి. ఊళ్ల‌కు ఊళ్లు ఇళ్ల‌కు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఏం జరిగినా కూడా స్పందించే వారు లేరు. ఏం జ‌రిగినా అడిగే వారూ లేరు. ఇప్ప‌టిదాకా వాన‌కు సంబంధించి అత‌లాకుత‌లం అయిన ప్రాంతాల‌కు చేసిన సాయం ఏమ‌యినా ఉందా అంటే అదీ లేదు. ఏదీ పైకి క‌నిపించ‌దు.



ఏదీ పైకి క‌నిపించినంత బాగా లోప‌ల ప్ర‌పంచం కానీ లోప‌ల వాస్త‌విక స్థితి కానీ ఉండ‌డం లేదు. అయినా కూడా చంద్ర‌బాబు నాయుడు ను టార్గెట్ చేయ‌డంలో ఏపీ అసెంబ్లీ ముందుంది. ఆయ‌నను టార్గెట్ చేసి, కొన్ని వ్యాఖ్య‌లు చేయ‌డంలో ఏపీ అసెంబ్లీలో కొంద‌రు ముందున్నారు. ఇవి త‌ప్ప ఏపీ అసెంబ్లీ ఇవాళ సాధించింది ఏమీ లేదు. అవ‌మానానికి అవ‌మానం ఎప్పుడో చెల్లు అయిపోయింది. ప్ర‌జ‌లే వ‌ద్ద‌న్నారు బాబును మిమ్మ‌ల్నే ఏలిక‌లుగా మారమ‌న్నారు అప్పుడు. ఆ ఎన్నిక‌లప్పుడు. ఇదంతా జ‌రిగి రెండున్న‌రేళ్లు జ‌రిగిపోయాయి. రెండు క్యాలెండర్లు సునాయాసంగా మారి పోయాయి. అయినా కూడా టీడీపీని టార్గెట్ చేయ‌డంలో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు వైసీపీ. వైసీపీ టార్గెట్ లో భాగంగా ఎన్నోవిప‌రీత పోక‌డలున్నాయి. అయినా కూడా వ్యాఖ్య‌లు తిట్లు అన్న‌వి ఎలా ఉన్నా ఆ రోజు మీరు చేశారు ఇప్పుడు మీ వంతు మేం చేస్తాం అన్నది మాత్ర‌మే వైసీపీ పెద్ద‌లు మ‌రియు నాయ‌కులు చెబుతున్న మాట. వినిపిస్తున్న మాట. ఇంకా చెప్పాలంటే  ఇదే ఇప్పుడు వారికి హాట్ టాపిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: