రెండు తెలుగు రాష్ట్రాల్లో కొందరు బడా నాయకుల గెలుపు ఎప్పుడు ఆగదనే చెప్పాలి. పైగా ఆ నాయకులకు పర్మినెంట్‌గా కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఆ నియోజకవర్గాల్లో వారిని ఓడించడం చాలా కష్టం. ఇక వరుసపెట్టి వారే అక్కడ గెలుస్తూ ఉంటారు. ఉదాహరణకు ఏపీలో చంద్రబాబుకు కుప్పం, జగన్‌కు పులివెందుల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరు..అటు తెలంగాణలో కేసీఆర్‌కు గజ్వేల్, హరీష్ రావుకు సిద్ధిపేట, కేటీఆర్‌కు సిరిసిల్ల...ఇలా పలువురు నాయకులకు పర్మినెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇక ఆ నియోజకవర్గాల్లో ఈ నాయకులని ఓడించడం చాలా కష్టం. అయితే వారి మాదిరిగానే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఒక నియోజకవర్గం కావాలి. మామూలుగా పవన్‌కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. ఇలా క్రేజ్ ఉన్న పవన్...గత ఎన్నికల్లో ఎంత దారుణంగా ఓడిపోయారో అందరికీ తెలిసిందే. గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ ఊహించని విధంగా ఓడిపోయారు.

సరే గెలుపోటములు అనేవి ఎవరికైనా సహజమే...కాబట్టి పవన్ ఓడిపోయారని చెప్పి, ఆయనకు సత్తా లేదని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ బట్టి చూస్తే...అసలు సత్తా తగ్గలేదనే చెప్పొచ్చు. కాకపోతే పవన్ ఇక్కడ ఒకటి చేయాలి...ఓడిపోయిన తర్వాత...తనకంటూ ఓ ప్రత్యేకమైన నియోజకవర్గాన్ని చూసుకుని...అక్కడ తిరుగులేని విధంగా బలపడాలి...కానీ ఈ రెండున్నర ఏళ్లలో పవన్ ఆ పనిచేయలేదు. అసలు ఎందుకు తనకంటూ ఒక నియోజకవర్గాన్ని డిసైడ్ చేసుకోలేకపోయారు. అంటే నెక్స్ట్ ఎన్నికల ముందు పరిస్తితిని బట్టి పోటీ చేయాలని ఆగిపోయారో..లేక ఒక నియోజకవర్గంపై ఫోకస్ చేసే సమయం లేక ఆగిపోయారో అర్ధం కాలేదు.

కానీ పవన్‌కు చంద్రబాబు, జగన్ మాదిరిగా ఒక కంచుకోట కావాలి. ఎలాంటి పరిస్తితుల్లోనైనా సరే ఆ నియోజకవర్గంలో పవన్ గెలిచేలా ఉండాలి. అలాంటి నియోజకవర్గాన్ని పవన్ తయారుచేసుకోవాలి...అయితే ఇప్పుడు పవన్‌కు ఏ నియోజకవర్గం అనుకూలంగా ఉందో తెలియని పరిస్తితి. కానీ ఆయన దృష్టి భీమవరంపైనే ఉందని తెలుస్తోంది. కాబట్టి అక్కడ ఫోకస్ చేసి...పర్మినెంట్‌గా అక్కడ పాగా వేయాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: