ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో వ్యాక్సినేషన్ అనేది తప్పని సరిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు ఇప్పటికే అత్యవసర వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లను ప్రజలందరికీ అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పై పోరాటానికి వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. మొదట్లో వ్యాక్సిన్పై అనుమానాలు వ్యక్తం చేసిన వారు సైతం ఇక ఇప్పుడు టీకా ఆవశ్యకతను తెలుసుకొని స్వచ్ఛందంగా  వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు.


ఇలా నేటి రోజుల్లో వ్యాక్సిన్ అనేది ఎంతో కీలకం గా మారిపోయిందని చెప్పాలి. అయితే ఇలా వ్యాక్సిన్ వేసుకున్న వారిని... వ్యాక్సిన్ ఏ సమయంలో వేసుకున్నారు ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా అని అడిగితే.. ఏ సమయంలో వేసుకుంటే ఏంటి.. ఎప్పుడు వేసుకున్న పెద్ద తేడా ఉండదు కదా అంటూ సమాధానం చెబుతారు ఎవరైనా. కానీ వాక్సిన్ వేసుకునే సమయం ద్వారా కూడా ఇక శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు సంఖ్య కూడా ఆధారపడి ఉంటుంది అన్నది ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది..


 రోజులో ఏ సమయంలో వ్యాక్సిన్ వేసుకున్నాము అన్న విషయంపై కూడా యాంటీ బాడీలు పెరుగుదల ఆధారపడి ఉంటుందట. ఇటీవల బ్రిటన్లో శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మిగతా సమయాల్లో కంటే మధ్యాహ్న సమయంలో టీకాలు వేసుకునే వారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. టీకా సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకునేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.  అయితే వ్యాధి లక్షణాలు దాని పై మందులు ప్రభావం కూడా సమయానుగుణంగానే ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతుండడం గమనార్హం. ఏకంగా 2190 మంది ఆరోగ్య కార్యకర్తల పై ఈ పరిశోధన జరిపినట్లు తెలిపారు. ఇలా మొత్తంగా మధ్యాహ్నం సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న వారందరిలో యాంటీ బాడీల సంఖ్య   మిగతా వారితో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు శాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: