
ఇక ఈ ప్రక్రియ ఇప్పటిలో జరిగేలా లేదు. కాబట్టి పొత్తుపై క్లారిటీ రావడం లేదు. కానీ బీజేపీలో ఉన్న కొందరు నేతలు మాత్రం టీడీపీతో పొత్తు ఉంటేనే గెలవగలుగుతామని లేదంటే డిపాజిట్ కూడా రాదని అనుకుంటున్నారు. అందుకే టీడీపీతో కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన నేతలు..పొత్తు ఉంటేనే తమకు గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఒకవేళ పొత్తు కుదరని పక్షంలో ఎన్నికల ముందు టీడీపీలోకి జంప్ చేసేయాలని కొందరు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇప్పటినుంచే తమ సీట్లని కూడా రిజర్వ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ...ధర్మవరం సీటు తనదే అన్నట్లు చెప్పుకుంటున్నారు. టీడీపీలో చేరి ఆ సీటులో పోటీ చేయడానికి గోనుగుంట్ల రెడీ అవుతున్నారు. కానీ అక్కడ పరిటాల శ్రీరామ్ ఉన్నారు. ధర్మవరం తనదే అని ఆయన అంటున్నారు.
ఇక బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం..టీడీపీలోకి వచ్చి జమ్మలమడుగు తీసుకోవాలని చూస్తున్నారు. అక్కడ ఇప్పుడు ఆది సోదరుడు తనయుడు భూపేష్ రెడ్డి టీడీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. అలాగే అవకాశం దొరికితే తాను కూడా టీడీపీలోకి వచ్చి విశాఖ నార్త్ తీసుకోవాలని విష్ణు కుమార్ రాజు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది.