గత కొంత కాలం నుంచి రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అన్న విషయం తెలిసిందే. యూరోపియన్ యూనియన్ లో చేరి సభ్యదేశంగా మారిపోతా అంటూ ఉక్రెయిన్ సిద్ధపడుతూ ఉంటే అలా జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ అటు రష్యా మాత్రం పట్టుబడుతుంది. మా చెప్పు చేతుల్లోనే ఉండాలి అంటూ రష్యా ఉక్రెయిన్ పై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తుంది అనే విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే చిన్న దేశం అయిన ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే ఉక్రెయిన్ కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు అమెరికా సహా యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా సిద్ధమయ్యాయ్. అదే సమయంలో నాటో కూటమి లో ఉన్న దేశాలు కూడా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచేందుకు సిద్ధమయ్యాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ కు  ఆర్థిక సహాయం తో పాటు ఆయుధ సహకారం కూడా అందించేందుకు సిద్ధమవుతున్నాయి నాటో దేశాలు. ఇకపోతే ఇటీవలి కాలంలో రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో అనే విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే ఇప్పటికే సరిహద్దుల్లో లక్ష మంది సైన్యాన్ని మోహరించింది రష్యా. మరో వైపు మరింత మంది సైన్యాన్ని మొహరిస్తూ ఉండడంతోపాటు ఆయుధాలను కూడా తెచ్చిపెడుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే అటు నాటో బహిరంగంగానే ఉక్రెయిన్ కి మద్దతు ఇచ్చేందుకు సిద్దమయింది. దీంతో 30 దేశాల మిలిటరీ కూటమి ఉక్రెయిన్ మద్దతుగా రంగంలోకి దిగిన తర్వాత సముద్ర జలాల్లో యుద్ధనౌకలు, ఫైటర్ జట్లను అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఉక్రెయిన్ నూ నాటో కూటమి లో చేర్చుకోవద్దు అంటూ రష్యా చెబుతున్నా.. మరోవైపు అటు నాటో దేశాలు మాత్రం రష్యా డిమాండ్ను పట్టించుకోవడం లేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: