కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న మంత్రివర్గం అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది...అతి త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేయడానికి జగన్ సిద్ధమవుతున్నారని మళ్ళీ కథనాలు వస్తున్నాయి...అధికారంలోకి వచ్చిన మొదట్లో జగన్ చెప్పిన మాట ప్రకారం...రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు జరగాలి...అంటే గతేడాది డిసెంబర్‌లో కొత్త మంత్రివర్గం రావాలి...కానీ జగన్ అప్పుడు మంత్రివర్గం గురించి మాట్లాడలేదు...కాకపోతే 100 శాతం మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం మాత్రం జరిగింది.

అదే సమయంలో కోవిడ్ వల్ల ఎక్కువ సమయం పోవడంతో మంత్రులకు మరో ఆరు నెలల పాటు అవకాశం ఇచ్చారని చెప్పి కథనాలు కూడా వచ్చాయి. కానీ తాజాగా ఫిబ్రవరి 18న మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయని ప్రచారం మొదలైంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో మాత్రం క్లారిటీ లేదు. అయితే ఈ నెలలో కాకపోయినా...మే నెలలోపు మాత్రం మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు గ్యారెంటీగా ఉన్నాయని తెలుస్తోంది.

ఇక అప్పుడు ఎలాంటి మార్పులు చేస్తారో చెప్పలేని పరిస్తితి..ఒకేసారి 100 శాతం మార్పులు చేసి, మళ్ళీ కొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారా? లేక కొంతమందిని మాత్రం సైడ్ చేసి, మిగిలిన వాళ్ళని కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదే సమయంలో మంత్రి పదవిపై చాలామంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకుని ఉన్నారు...ఈ క్రమంలోనే సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సైతం పదవి కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారని తెలుస్తోంది...సీనియర్ నేతగా ఉన్న ఈయన ఇదే చివరిసారి అన్నట్లు పదవి కోసం ట్రై చేస్తున్నారు..మళ్ళీ గెలుస్తారో లేదో తెలియదు...ఒకవేళ గెలిచిన వైసీపీ అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేం.

కాబట్టి ఇప్పుడే పదవి దక్కించుకోవాలని అంబటి చూస్తున్నారు...అయితే అంబటికి పదవి ఇవ్వాలంటే కాపు కోటాలో ఉన్న ఒక మంత్రిని తప్పించాలి. అయితే కాపు కోటాలో ఉన్న పేర్ని నాని, ఆళ్ళ నాని, కన్నబాబుల ప్లేస్‌లో రావడానికి పలువురు కాపు ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారు. అయితే అవంతి శ్రీనివాస్ ప్లేస్ మాత్రమే అంబటికి ఉంటుందని చెప్పొచ్చు..మరి అవంతి ప్లేస్‌లో అంబటిని మంత్రివర్గంలోకి తీసుకుంటారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: