దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 29 లక్షల 75 వేలకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 5,15,355 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశం లో 46, 962 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలియచేశారు. కరోనా ఆనవాళ్లు కూడా రూపుమాపుతున్నాయి అని కొందరు అంటుంటే నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉందని మరికొందరు నిపుణులు అంటున్నారు. అయితే గత కొద్దీ రోజులుగా మంచి రోజులొచ్చాయి అని అనుకునే లోపు మళ్ళీ కేసులు పెరగడం అన్నది మంచి పరిణామం అని చెప్పలేము.
కాబట్టి మళ్ళీ మనకు మనమే కరోనా నియమ నిబంధనలను పాటించేందుకు సమయం ఆసన్నమైంది. ఈ క్షణం నుండి మీరు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఎక్కడికి వెళ్లినా చేతిలో శానిటైజర్, ముఖానికి మాస్క్ లేకుండా వెళ్లకపోవడమే మంచిది. వీటితో పాటుగా మీరు బయట వెళ్ళినప్పుడు మనిషికి మనిషికి మధ్యన సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. మరి ఇక ముందు రాష్ట్రంలో కేసులు పెరగడమా? తగ్గడమా? అన్నది మీ చేతుల్లోనే ఉంది అన్న విషయం తెలుసుకోండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి