గత కొంతకాలం నుంచి భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత ఆర్మీ ఎంత అప్రమత్తంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉగ్రవాదులు భారత్ లోకి అక్రమంగా చొరబడాలి అనే ఆలోచన వస్తే చాలు వెన్నులో వణుకు పుట్టించే విధంగా దాడులకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. ఇలా ఇటీవలి కాలంలో ఇక వరుసగా ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేస్తూ  వస్తుంది భారత ఆర్మీ. గత కొన్ని నెలల నుంచి వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇక ఇటీవలే ఒక కీలకమైన ఎన్ కౌంటర్ చేసింది  అని అర్థమవుతుంది. గతంలో పుల్వామా లో ఏకంగా ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాదులు ఎంతలా మారణహోమం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఎంతోమంది సైనికులు ఇక ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇక మరోసారి ఇలాంటి మారణహోమం జరగకుండా భారత్ ఆర్మీ ఎప్పటికప్పుడు అప్రమత్తం గానే ఉంటుంది. ఇకపోతే ఇటీవల జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో భారీ ఎన్కౌంటర్ చేసాయ్ భారత బలగాలు. ఇక కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం అయ్యాడు అన్నది తెలుస్తుంది. అంతే కాకుండా మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా అరెస్టు చేసామని భారత భద్రతా బలగాలు చెబుతున్నాయి. ఇక మరికొంత మంది ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో నక్కి ఉన్నారు అని సమాచారం అందుకున్న భారత ఆర్మీ.. వారి కోసం గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఉగ్రవాదులు భారత ఆర్మీ మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి అన్న విషయం అర్థమవుతుంది. పుల్వామా లోని నైనా బట్ పోరాలో భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఆపరేషన్ లో ఇక ఈ ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఉగ్రవాదులు ఇంకా ఘటనా స్థలంలోనే నక్కి ఉన్నారని వెంటనే భారత బలగాలకు లొంగిపోవాలి అంటూ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు భారత బలగాలు. సెర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కదలికలు మొత్తం నిలిచి పోయినట్లు తెలుస్తోంది. ఇక సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బలగాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: