తన పరిపాలనలోనే సామాజికన్యాయం జరుగుతోందని చాటి చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ చేశారు. అదేమిటంటే ఈనెల 26వ తేదీనుండి బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులతో నాలుగు రోజులు బస్సుయాత్రను డిజైన్ చేశారు. ఈనెల 26వ తేదీన మొదలవ్వబోయే బస్సుయాత్ర 29వ తేదీన ముగుస్తుంది. శ్రీకాకుళం లేదా విజయనగరంలో బహిరంగసభతో మొదలయ్యే యాత్ర రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురం బహిరంగసభలతో ముగుస్తుంది.






మార్గమధ్యలో నియోజకవర్గాలను, మండల కేంద్రాల్లో కూడా చిన్నపాటి సమావేశాలుంటాయి. ఈ యాత్రలో పై వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలతో పాటు సీనియర్ నేతలు కూడా ఉంటారు. వీరంతా తమ యాత్రలో గతంలో చంద్రబాబునాయుడు పాటించిన సామాజికన్యాయం, ఇపుడు జగన్ పాటిస్తున్న సామాజికన్యాయాన్ని జనాలకు వివరించబోతున్నారు. ఈ యాత్రవల్ల ఏదో అయిపోతుందని ఎవరు అనుకోవటంలేదు. కాకపోతే నాలుగు ప్రాంతాల్లో బహిరంగసభలు పెట్టడం, జనాలను కలవటం వల్ల ఉపయోగం ఉంటుంది.





అదేమిటంటే వచ్చే ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను జగన్ ఒక్కడే చూడాల్సుంటందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ప్రచార బాధ్యతలను తానొక్కడే కాకుండా పార్టీలో ప్రచారం చేయగలిగే వాళ్ళు ఇంకా ఉన్నారని చాటి చెప్పటమే జగన్ ఉద్దేశ్యం. అందుకనే బస్సుయాత్ర పేరుతో సుమారు 100 మందిని రెడీ చేస్తున్నారు. దీంట్లో ఒక 15-20 మంది బాగా మాట్లాడగలిగిన వాళ్ళు హైలైట్ అయినా చాలు జగన్ ప్రయత్నం సక్సెస్ అయినట్లే.





ఇలాంటి యాత్రలను ముందు ముందు జగన్ మరిన్ని ప్లాన్ చేయబోతున్నారు. దానివల్ల రెండేళ్ళల్లో రాష్ట్రమంతా తిరిగి పార్టీ కోసం అభ్యర్ధుల కోసం ప్రచారం చేయగలిగిన వాళ్ళు తయారైతే జగన్ పై భారం తగ్గుతుందనటంలో సందేహంలేదు.  ఎంతసేపు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తాను అది చేశాను, ఇది చేశాని జగన్ ఒక్కడే చెప్పటం కాకుండా పై వర్గాల్లోని నేతలతో కూడా చెప్పిస్తేనే జనాలు మరింత తొందరగా కనెక్టవుతారన్నది జగన్ ఆలోచన. అందుకనే ప్రచారంలో గట్టివాళ్ళని తయారు చేసుకునేందుకే బస్సుయాత్ర చేయిస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.


 



మరింత సమాచారం తెలుసుకోండి: