
అయితే ఇక్కడ అండర్ డాగ్ గా బరిలోకి వచ్చిన షర్మిల పార్టీ వైస్సార్ టీపీ గురించి తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని కొందరు చెబుతున్నా... కొన్ని సర్వేలు మాత్రం ఇక్కడ తెరాస కాంగ్రెస్ లను మినహాయించి వేరే ఇతర పార్టీలు అధికారాన్ని దక్కించుకోవడం చాలా కష్టం అని చెబుతున్నాయి. ఇక రీసెంటుగా నిర్వహించిన ఒక సర్వేలో ఓటర్లు షర్మిలను ఉద్దేశించి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. షర్మిల అనవసరంగా ఏపీని వదిలి ఇక్కడకు వచ్చి సమయాన్ని వృధా చేసుకుంటోంది.. షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా ఓట్లు పడవు అంటూ కామెంట్స్ చేశారట.
ఇక మరి కొందరు ఓటర్లు అయితే మేము మా ఓటును కాంగ్రెస్ పార్టీకి వేస్తాము కానీ షర్మిలకు వేసే ప్రసక్తే లేదని చెప్పడం నిజంగా ఆశ్చర్యకరం. ఇక ఇప్పటి వరకు షర్మిలతో వస్తున్న వాళ్ళు అందరూ కూడా డబ్బు కోసమే తప్ప, ప్రేమ అభిమానం కాదని అంటున్నారు. పెద్దాయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆయన పేరు చెప్పుకుంటూ ఓట్లు అడగడం వర్క్ అవుట్ కాదని డైరెక్ట్ గా అంటున్నారు. మరి వీటన్నిటినీ దాటుకుని షర్మిల సత్తా చాటుతుందా లేదా అన్నది చూడాలి.