వచ్చే ఎన్నికల్లోగా నరేంద్రమోడీతో చంద్రబాబునాయుడుకు పొత్తు కుదరకపోతే భవిష్యత్తు ఎలాగుంటుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా టీడీపీకి మార్గదర్శనం చేస్తున్న ఎల్లోమీడియాకు మోడీ-చంద్రబాబు కలవటం అత్యవసరం. లేకపోతే చంద్రబాబుతో పాటు పార్టీ+నమ్ముకున్న ఎల్లోమీడియా పరిస్ధితి అధోగతే. అందుకనే మోడీ-చంద్రబాబును ఎలాగైనా జోడీ చేయాలని చాలాకాలంగా నానా అవస్తలు పడుతున్నది ఎల్లోమీడియా.

ఇపుడు ఢిల్లీలో ఆజాదీకి అమృతోత్సవ్ కార్యక్రమంలో దాదాపు ఐదేళ్ళ తర్వాత మొదటిసారి మోడీకి ఎదురుపడే అవకాశం చంద్రబాబుకు వచ్చింది. ఇంకేముంది ఎల్లోమీడియా రెచ్చిపోయింది. మోడీ, చంద్రబాబు కలుసుకున్నారని, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నారని, అసలు ఇంతకాలం ఢిల్లీకి ఎందుకు రాలేదని చంద్రబాబును మోడీ అడిగారంటు రకరకాలుగా కథలల్లేశారు. మీతో నేను చాలా మాట్లాడాల్సుందని మోడీ అనగానే నేనూ మిమ్మల్ని కలుద్దామని అనుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారంటు రచ్చ రచ్చ చేసేసింది.

మీరు కచ్చితంగా ఢిల్లీకి రావాల్సిందే ఇది మీ ఇల్లే అనుకోండంటు చంద్రబాబుకు మోడీ స్పష్టంగా చెప్పారంటు రాసుకొచ్చేసింది ఎల్లోమీడియా. తామురాసిందాన్ని చదవిన జనాలు నవ్వుకుంటారన్న మొహమాటాన్ని కూడా ఎల్లోమీడియా ఎప్పుడో వదిలేసింది. నవ్వుకోవటం ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు రావటంలేదో మోడీకి తెలీదా ? అసలిప్పుడు చంద్రబాబుకు ఢిల్లీలో పనేముంది రావటానికి. ఢిల్లీకంటు వస్తే అది మోడీనో లేకపోతే అమిత్ షాను కలవటానికే కదా రావాల్సింది. మోడీ, అమిత్ షా చంద్రబాబు మొహం చూడటానికి కూడా ఇష్టపడటంలేదని చంద్రబాబుతో పాటు అందరికీ తెలుసు.

గతంలో తమను కలవాలని చంద్రబాబు ఢిల్లీకి వచ్చి అపాయిట్మెంట్ అడిగితే ఇస్తామని కానీ ఇవ్వమని కూడా ఇద్దరు చెప్పకపోవటంతో చేసేదిలేక తిరిగొచ్చేశారు. వాస్తవాలు ఇలాగుంటే మోడీ మాత్రం చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు రావటంలేదని అడగిరాని, ఢిల్లీని మీ ఇల్లే అనుకోండని అన్నారంటు సొల్లు కతలు రాస్తే జనాలు నవ్వుకోక ఏమిచేస్తారు ? అబద్ధం చెప్పినా అతికినట్లుండాలని పెద్దలంటారు. ఇక్కడ కతలు రాసినా నిజమేనేమో అనేట్లుండాలన్న కనీస ఆలోచన కూడా ఎల్లోమీడియాకు లేకపోయింది. మొత్తానికి మోడీతో చంద్రబాబును కలపటానికి ఎల్లోమీడియా పడుతున్న అవస్తలు అన్నీ ఇన్నీ కావు.

మరింత సమాచారం తెలుసుకోండి: