ఏపీలో రానున్న ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు మరియు రాజకీయ విశ్లేషకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే అంతకు మించి ఏపీలో ఉన్న ఓటర్లు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఏ ఎన్నిక అయినా ఓటర్ల వలనే రసవత్తరంగా మారుతుంది.. వారు వేసే ప్రతి ఒక్క ఓటు రాజకీయ నాయకులు మరియు పార్టీల భవిష్యత్తును తిరగరాస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలు ఏపీలో జరిగాయి. కానీ ఈసారి జరిగే ఎన్నికలు మాత్రం ఒక పార్టీకి చాలా కీలకం కానున్నాయి. దాదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు కు ఈ ఎన్నికల్లో గెలవడం అత్యంత అవసరం.

వాస్తవానికి గత ఎన్నికల్లో వైసీపీ ని చాలా లైట్ గా తీసుకోవడం మూలంగానే ఇప్పుడు టీడీపీ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అందుకే ఈ సారి ఎన్నికల్లో గెలిచి వైసీపీని సైడ్ చేయాలన్న ప్లాన్ తో చంద్రబాబు వరుస మీటింగ్ లను కండక్ట్ చేస్తూ ఇంచార్జి లను అలర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలో టీడీపీ ఓడిపోతే ఇక చంద్రబాబు అందు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ఏమీ లాభం ఉండదు అని సొంత పార్టీ వారే కామెంట్ చేస్తున్నారు. అందుకే చంద్రబాబు అండ్ టీం ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ మరియు గ్రాఫ్ ను బట్టి చూస్తే టీడీపీకి విజయావకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది. వైసీపీ పై కొన్ని అంశాల వలన ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, అదేమంత ఓటమికి కారణం కాకపోవచ్చు అని సర్వే ల ద్వారా తెలుస్తోంది. ఇక బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడిగా ఇవే ఆఖరి ఎన్నికలు అంటూ కామెంట్స్ వినబడుతున్నాయి. మరి రానున్న ఎన్నికలలో చంద్రబాబు ప్రజలను తన వైపుకు తిప్పుకుని ఎన్నికలో విజయం సాధిస్తాడా లేదా మరోసారి వైసీపీ చేతిలో ఓడిపోయి రాజకీయాల నుండి తప్పుకుంటాడా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: