ఢిల్లీ మధ్యం కుంబకోణంలో సీబీఐ నోటీసులు అందుకున్న కల్వకుంట్ల కవిత విషయంలో కేంద్రప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళ్ళబోతోంది ? ఇపుడిదే అంశంపై జోరుగా చర్చలు జరుగుతోంది. ఎందుకంటే సీబీఐ విచారణకు కవిత నిరాకరించిన విషయం తెలిసిందే. విచారణకు హాజరవ్వాలని 160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.  విచారణకు తనింటికే రావాలని చెప్పిన కవిత తర్వాత మాట మార్చారు. కేసీయార్, లాయర్లతో భేటీ తర్వాత అసలు ఫిర్యాదుఏమిటి ? ఎఫ్ఐఆర్ పంపితే విచారణ సంగతి ఆలోచిస్తానని సమాధానమిచ్చారు.

అంటే సీబీఐ విచారణను వీలైనంతగా తప్పించుకోవాలని కవిత ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే సీబీఐ గనుక 41 సీఆర్పీసీ నోటీసిస్తే అప్పుడు తప్పనిసరిగా విచారణకు హాజరవ్వాల్సిందే తప్ప వేరేదారిలేదంటున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే కేసీయార్ ఏమో తెలంగాణాలోకి సీబీఐ ఎంట్రీని నిషేధించారు. కూతురు కవితేమో విచారణకు సీబీఐని తనింటికే రమ్మని మొదట్లో అడిగారు. కేసీయార్-కవిత వ్యవహారశైలికి ఏమన్నా పొంతనుందా ?

ఇపుడు జరగబోయేదేమి అంటే తెలంగాణాలో ఎంట్రీకి సీబీఐ కోర్టునుండి పర్మీషన్ తెచ్చుకోవాలి. లేదా కేసును ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అప్పగించాలి. కేసు సీబీఐ నుండి ఈడీకి బదిలీ అయితే కేసీయార్ ఏరకంగాను విచారణను అడ్డుకోలేరు. కాకపోతే కవిత విచారణ రాజకీయంగా తీసుకోబోయే మలుపుల పైనే ఆధారపడుంది. తొందరలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా ఇపుడు తన కూతురు కవితను సీబీఐ లేదా ఈడీ విచారించటాన్ని కేసీయార్ రాజకీయం చేస్తారనటంలో సందేహంలేదు.

అప్పుడు దీన్ని ఏవిధంగా ఎదుర్కోవాలనే విషయంలోనే బీజేపీ తెలివితేటలు ఆధారపడున్నాయి. ఇప్పటికే కొన్నిరాష్ట్రాల్లో దర్యాప్తు సంస్ధలను బీజేపీ ప్రత్యర్ధులను ఇబ్బందులు పెట్టడానికి  వాడుకుటోందనే ఆరోపణలకు కొదవలేదు. ఆల్రెడీ తెలంగాణాలో స్టార్టయిపోయింది. మంత్రి మల్లారెడ్డిపై ఐటి విచారణ, మరో మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)ను ఈడీ విచారించాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో దర్యాప్తు సంస్ధల వేధింపులే కీలకమైన అస్త్రాలుగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: