ఎల్లోమీడియా బాధలు పగోడికి కూడా రాకూడదు. 24 గంటలూ 365 రోజులు చంద్రబాబునాయుడుకు జాకీలు వేసి లేపటంతో పాటు జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లేయటమే టార్గెట్ గా పనిచేస్తోంది.  తాజాగా నరేంద్రమోడీ ఆధ్వర్యంలో జరిగిన జీ20 దేశాల సన్నాహక సమావేశాన్ని ఇందుకు ఎల్లోమీడియా వాడుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే టీ బ్రేక్ లో జగన్మోహన్ రెడ్డిని మోడీ నిలదీశారని పెద్ద కథనమే రాసేసింది. ఇదే సమయంలో చంద్రబాబుతో చాల క్లోజ్ గా మాట్లాడారని చెప్పింది.

ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలను మోడీ అడిగి మరీ తెలుసుకున్నారట. బాగా చిక్కిపోయారేంటని మోడీ అడిగితే తాను బాగా తిరుగుతున్నట్లు చంద్రబాబు చెప్పారట. అవును ఈవిషయంలో తనకు ఫీడ్ బ్యాక్ ఉందని మోడీ అన్నారట. రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ తన నోటీసులో ఉన్నాయని కూడా చంద్రబాబుతో మోడీ చెప్పారట. ఇక్కడే ఎల్లోమీడియా తప్పులో కాలేసింది. చంద్రబాబు సన్నబడటానికి ఆయనేమైనా పాదయాత్ర చేస్తున్నారా ? బస్సులోనో లేకపోతే కారులోనే కదా తిరుగుతున్నది.

ఇపుడు సన్నబడటానికి ఒకపుడు ఏమైనా చంద్రబాబు లావుగా ఉన్నారా ? ఈ వయసులో కూడా చంద్రబాబు యాక్టివ్ గా ఉన్నారంటే ఫుడ్, ఎక్సర్ సైజ్ విషయంలో తీసుకునే జాగ్రత్తలే అని అందరికీ తెలుసు. ఇంతోటిదానికి చంద్రబాబు సన్నబడ్డారని, మోడీ ఆరాలు తీశారని ఎల్లోమీడియా కథనం రాయటమే విచిత్రంగా ఉంది.

ఈ విషయాన్ని పక్కనపెడితే చంద్రబాబు దగ్గర నుండి మోడీ దూరంగా వెళ్ళగానే వెంటనే హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చేశారట. కాసేపు చంద్రబాబుతో మాట్లాడారట. తర్వాత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్, ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్ తో పాటు చాలామంది కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యమంత్రులు చంద్రబాబుతో మాట్లాడటానికి ఎగబడ్డారన్నట్లుగా రాసేసింది. చివరగా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా కూడా చంద్రబాబుతో మాట్లాడారట. ఎల్లోమీడియా రాసింది ఎలాగుందంటే సమావేశంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మోడీ కాదు చంద్రబాబే అన్నట్లుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: