మన కుటుంబంలోని ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం పలు ఉపయోగకరమైన పథకాలు ప్రవేశపెడుతుంది. ఇలా ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్తమ పథకాలలో సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటనే చెప్పాలి. ఇక ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆ పథకం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆర్థికంగా ఆదుకొని వారికి చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఇంకా వారి వివాహాలు చేయటానికి చింతించాల్సిన అవసరం లేదు. ఈ పథకంలో కనుక పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఆడపిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి పథకంలో పెట్టుబడి పెట్టడానికి బ్యాంకులు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతను తెరవవచ్చు.ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలకు మొత్తం 7.6 శాతం వడ్డీ వస్తుంది. మనం పెట్టిన పెట్టుబడి మీద ఈ లాభం అనేది ఆధారపడి ఉంటుంది.


ఇంకా ఈ పథకం ద్వారా లబ్ధి పొందటానికి భారత పౌరులకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఆడపిల్లల పేరు మీద డబ్బులు పొదుపు చేయటానికి సుకన్య సమృద్ధి యోజన స్కీం కింద అకౌంట్ ను ఓపెన్ చేసే సమయానికి అమ్మాయి వయస్సు ఖచ్చితంగా 18 ఏళ్ళు మించి ఉండరాదు. అలాగే సుకన్య సమృద్ధి యోజన ఖాతా కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఓపెన్ చేస్తారు. సుకన్య పథకంలో అకౌంట్ తీసుకోవాలంటే కనీస మొత్తం రూ.250తో ఖాతాని ప్రారంభించాలి. గరిష్టంగా సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకూ ఈ ఖాతా దాచుకోవచ్చు. ఉదాహరణకు మీరు పది సంత్సరాల కాలనికి మొత్తం 7.6 శాతం వడ్డీరేటుతో నెలకు రూ.8333 పెట్టుబడి కనుక పెడితే అది సంవత్సరానికి రూ. లక్ష అవుతంది. ఇక అది మెచ్యూర్ అయ్యాక వడ్డీతో కలిపి మొత్తం రూ.15,29,458 లాభాన్ని మీరు పొందవచ్చు.కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. లాభాలు పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: