
అవినీతి కేసుల్లో చంద్రబాబునాయుడును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుక్కతిప్పుకోనీయటంలేదు. కేసుల మీద కేసులు పిటీషన్ల మీద పిటీషన్లు వేసి ఊపిరి ఆడకుండా చేసేస్తోంది. తాజాగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై ప్రభుత్వం పీటీ(ప్రిజనర్ ఆన్ ట్రాన్సిట్) వారెంటును దాఖలు చేసింది. ప్రభుత్వం వేసిన పిటీషన్ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. అంటే వెంటనే వాదనలు కూడా మొదలైపోయినట్లే. పీటీ వారెంటు దాఖలు చేయటం అంటే కేసులో నిందితుడిని విచారణకు తీసుకోవటానికి కోర్టును అనుమతి కోరినట్లు.
ఇప్పటికే స్కిల్ స్కామ్ లో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్న చంద్రబాబుపై ఇదే కేసులో పీటీ వారెంట్ జారీచేసుంది. పైగా ఐదురోజుల కస్టడీకి ఏసీబీ కోర్టును సీఐడీ అడిగింది. సీఐడీ కస్టడీ అవసరంలేదనే చంద్రబాబు లాయర్లు వాదిస్తున్నారు. అంగళ్ళు అల్లర్లు, అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కామ్ కేసుల్లో చంద్రబాబే కీలకవ్యక్తిగా ఏసీబీ, సీఐడీ కేసులు పెట్టిన విషయం తెలిసిందే.
అన్నీ కేసుల్లోను చంద్రబాబు మీద ఏసీబీ, సీఐడీ పీటీ వారెంట్లు జారీచేసుంది. జరుగుతున్నది చూస్తుంటే రిమాండులో నుండి చంద్రబాబు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే అవకాశాలు లేవని అర్ధమవుతోంది. ఎందుకంటే ఒక కేసులో నుండి బయటపడేలోగా మరో కేసులో అరెస్టు చేస్తారు. అరెస్టు చేయగానే కోర్టులో ప్రవేశపెట్టి మళ్ళీ రిమాండుకు పంపుతారు. అచ్చంగా ఒకపుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్టుచేసి 16 మాసాలు జైలులో ఉంచినట్లుగానే ఉంది ఇపుడు జరుగుతున్నది కూడా.
ఇదే విషయమై చంద్రబాబు మద్దతుదారుల్లో ఒకళ్ళయిన న్యాయనిపుణుడు జడ sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ మాట్లాడుతు చంద్రబాబు మరో ఆరుమాసాల వరకు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. చంద్రబాబు మీద ఇప్పటికే ఏడో, ఎనిమిదో పీటీ వారెంట్లు జారీ అయ్యాయని వీటిల్లో నుండి బయటపడాలంటే కనీసం ఆరుమాసాలు పడుతుందని అభిప్రాయపడ్డారు. ఏసీబీ, సీఐడీ చాలా జాగ్రత్తగా లీగల్ గా చంద్రబాబు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా వారెంట్లు జారీచేస్తోందన్నారు. సీఐడీ కస్టడీకి పోకుండా చంద్రబాబు బయటపడటం చాలా కష్టమని శ్రవణ్ తేల్చేశారు.