
దీంతో ఆయన సమావేశాలు అయిపోయిన తర్వాత కెనడా వెళ్లి అక్కడి పార్లమెంట్ లో మాట్లాడుతూ.. భారత్ తమ దేశంలో లోని పౌరుడిని ఖలిస్తాన్ అనే ఉగ్రవాది అనే నెపంలో చంపించిందని ఆరోపించారు. కెనడా పౌరుడిని చంపడాన్ని తాము ఏ మాత్రం సహించమని భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. దీంతో ఒకప్పటి భారత్ లా కాకుండా వెంటనే ఇండియాలోని కెనడా దౌత్యవేత్తను విదేశాంగ కార్యాలయానికి పిలిపించి అయిదు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. అంతే కాకుండా వెంటనే కెనడా దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు చెప్పింది.
కెనడాలో ఇప్పటికే ఇద్దరు ఖలిస్తాన్ ఉగ్రవాదులను కొంతమంది కాల్చి చంపారు. దీనిపై కెనడా ప్రభుత్వం భారత ఏజెంట్లే చంపేశారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో భారత్ ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్ పై కుట్రలు చేసే ఏ దేశంతోనైనా ఇలాగే ప్రవర్తిస్తామని ఇప్పటికే చాటి చెప్పారు. టర్కీ కశ్మీర్ విషయంలో మాట్లాడితే వెంటనే దాని శత్రు దేశమైన గ్రీస్ కు ఆయుధాలు పంపించి హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం కెనడా లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని చెబుతూనే.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప రావాలనుకుంటే ఇండియాకు వచ్చేయాలని కోరింది. యూరప్ కంట్రీ అయిన కెనడాా పరువు పోయింది ఇప్పటి వరకు కెనడాతో ఈ విధంగా ప్రవర్తించిన దేశం లేదు. దేశంలో కుట్రలు చేయాలనుకునే ఏ దేశంతోనైనా ఇదే విధంగా కఠినంగా ఉంటామని చెప్పింది. మొత్తానికి ఇండియా కెనడా మధ్య సంబంధాలు మాత్రం ఖలిస్తాన్ ఉద్యమం కారణంగా దెబ్బ తింటున్నాయి.