చంద్రబాబునాయుడు మెంటల్ గా బాగా ప్రిపేర్ అయినట్లే ఉన్నారు. విచారణలో సీఐడీ అధికారులు ఏ ప్రశ్నలు అడిగినా సరే తాను అనుకున్న సమాదానాలను మాత్రమే చెప్పాలని. ప్రశ్నలు ఎన్నిరకాలుగా తిప్పితిప్పి వేసినా సరే సమాధానాలు మాత్రం ఒకే రకంగా ఉండాలని. ఇదంతా ఏమిటంటే రాజమండ్రి సెంట్రల్ జైలులో స్కిల్ స్కామ్ పై శనివారం చంద్రబాబును సీఐడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. చంద్రబాబునుండి సమాధానాలు రాబట్టేందుకు అధికారులు సుమారు 120 ప్రశ్నలను రెడీ చేసుకున్నారు. అయితే మొదటిరోజైన శనివారం 50 ప్రశ్నలను కూడా అడగలేకపోయినట్లు తెలుస్తోంది.
దీనికి కారణం ఏమిటంటే చంద్రబాబు వైఖరే. ప్రశ్న ఏదైనా సరే సమాధానం మాత్రం తెలీదు, గుర్తులేదు, మరచిపోయానని. ఈ సమాధానాలకు అదనంగా అప్పటి డాక్యుమెంట్లను పరిశీలించాలని చెప్పి పరిశీలనపేరుతో  చాలా సమయాన్ని కావాలనే  వృధాచేశారట. హోలుమొత్తంమీద చూస్తే మొదటిరోజు సీఐడీకి చంద్రబాబు పెద్దగా సహకరించలేదని అర్ధమవుతోంది. అయితే ఎల్లోమీడియా మాత్రం సీఐడీ విచారణను చంద్రబాబు ధీటుగా ఎదుర్కొన్నట్లు చెప్పింది.
విచారణలో చంద్రబాబు ధీటుగా చెప్పింది ఏమిటంటే స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధంలేదని, అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని, జరగని కుంభకోణాన్ని జరిగినట్లుగా చూపించి ప్రభుత్వం, సీఐడీ కుట్రపన్ని తనను ఇరికించిందని మాత్రమే. ఈ విషయాలను చంద్రబాబు మొదటినుండి కోర్టులో వాదిస్తునే ఉన్నారు. అయితే ఒప్పందంలో అంశాలకు జీవోలోని అంశాలకు తేడా ఎందుకు ఉందని అడిగితే సమాధానం చెప్పలేదు.
ఒప్పందంలో భాగంగా సీమెన్స్ 90 గ్రాంట్ ఇన్ ఎయిడ్ విడుదల చేయకుండానే ప్రభుత్వం రు. 371 కోట్లు ఎందుకు విడుదలచేసిందని అడిగితే మౌనమే సమాధానం. సీమెన్స్ కు నేరుగా డబ్బులు విడుదలచేయకుండా మధ్యలో డిజైన్ టెక్ సంస్ధకు ఎందుకు డబ్బులు ఇచ్చారంటే నోరిప్పలేదు. నిధుల విడుదలకు చీఫ్ సెక్రటరీతో పాటు ఫైనాన్స్ ప్రిన్సిపుల్ సెక్రటరీ, సెక్రటరీపై ఎందుకు ఒత్తిడి తెచ్చారంటే సమాధానమే చెప్పలేదని తెలిసింది. క్యాబినెట్ లో చర్చించకుండానే స్కిల్ సెంటర్ ఏర్పాటుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే మాట్లాడలేదు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే విచారణలో సమాధానాలు చెప్పాల్సినవి ఏవి, చెప్పకూడనవి ఏవనే విషయంలో ముందే బాగా ప్రిపేర్ అయినట్లే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: