ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీట్లు ద‌క్క‌ని ప‌లువురు నేత‌ల‌కు చంద్ర‌బాబు ఆయిట్ మెంట్లు పూసేశా రు. ఒక‌రా ఇద్ద‌రా చాలా మంది కీల‌క నేత లు కూడా ఈ సారి ఎన్నిక‌ల్లో సీట్లు త్యాగాలు చేయాల్సి న ప‌రిస్థితి వ‌చ్చేసింది.  ఎన్నిక‌ల వేడి రాజుకున్న వేళ టీడీపీలో టిక్కెట్లు ద‌క్క అన్యాయాని కి గురైన నేత‌ల లిస్ట్ చాలానే ఉంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు నేత‌లు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే కోంద‌రు నేత‌లు పార్టీ మారిపోగా మ‌రి కొంద‌రు కూడా అదే బాట‌లో ఉన్నారు. మిగిలిన నేత‌లు కూడా పార్టీ మారే ఏర్పాట్ల‌లో బిజీగా ఉండ‌డంతో చంద్ర‌బాబు వారికి ఆయిట్ మెంట్ పూసే ప‌నిలో బిజీగా ఉన్నారు. టిక్కెట్లు ద‌క్క‌ని ప‌లువురు సీనియ‌ర్ల‌కు కీల‌క ప‌ద‌వులు.. పార్టీ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి వారిని శాంతింప జేస్తున్నారు.

ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో కొవ్వూరు సీటు ఆశించి భంగ‌ప‌డ్డారు మాజీ మంత్రి కేఎస్‌. జ‌వ‌హ‌ర్‌. ఆయ‌న ప్ర‌స్తుతం రాజ‌మండ్రి పార్ల‌మెంట‌రీ జిల్లా అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు. ఆయ‌న ఒకానొక ద‌శ లో కొవ్వూరులో పార్టీ సీనియ‌ర్ నేత అచ్చిబాబు పై తీవ్ర స్ధాయిలో విరుచుకు ప‌డ్డారు. పార్టీ మార‌తార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. చంద్ర‌బాబు జ‌వ‌హ‌ర్ కు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.

ఇక మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్ర‌హ్మ‌ణ్యం రామ‌చంద్రాపురం సీటు ఆశించి భంగ‌ప‌డ్డారు. ఇప్పుడు చంద్ర‌బాబు ఆయ‌న‌కు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఛాన్స్ ఇచ్చారు. ఇక పెందుర్తి లేదా విశాఖ న‌గ‌రంలో ఏదొ ఒక సీటు ఆశించారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. ఆయ‌న‌కు పొత్తుల్లో జ‌న‌సేన‌కు సీట్లు వెళ్లి పోవ‌డంతో నిరాశే మిగిలింది. దీంతో గండి బాబ్జీ ని విశాఖ పార్ల‌మెంట‌రీ జిల్లా అధ్య‌క్షుడి గా నియ‌మించారు.
హిందూపురం పార్ల‌మెంటు పార్టీ అధ్య‌క్షుడి గా బివి. రాముడు, పార్టీ కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శులుగా సీఎం ర‌మేష్ తో పాటు మ‌న్ను సుబ్బారెడ్డి ల‌ను నియ‌మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: