పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు అధికారంలో ఉండగా కేసీఆర్ చేసిన పనిని ఇక ఇప్పుడు రేవంత్ చేస్తున్నారు. మేం గేట్లు ఎత్తివేస్తే మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడు అని గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యేలాగే కనిపిస్తూ ఉన్నాయ్. ఎందుకంటే మొన్నటివరకు బిఆర్ఎస్ కీలక పదవులు చేపట్టి కెసిఆర్ కు ఆప్తులుగా ఉన్నవారు సైతం ఇక పార్టీని వీడుతో కాంగ్రెస్ గూర్చికి చేరుతూ ఉన్నారు.


 ఇప్పటికే కడియం శ్రీహరి, కేకే సహ మరి కొంత మంది కీలక నేతలందరూ కారు దిగి చెయ్యి అందుకున్నారు. ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ గుర్తుకి చేరుతారు అనే విషయంపై కూడా స్పష్టత లేదు. ఇలా కీలక నేతలు అందరూ పార్టీని వీడుతున్న సమయంలో కేసిఆర్ ఫామ్ హౌస్ లోనే సైలెంట్ గా ఉండిపోవడం మిగతా నేతలు అందరిలో కూడా అంతర్మదనానికి కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక ఇప్పుడు గులాబీ దళపతి కేసీఆర్ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఆత్మవిశ్వాసం పెంచడంపై ఫోకస్ పెట్టారట కెసిఆర్.



 ఇందులో భాగంగానే ఏప్రిల్ 13వ తేదీన చేవెళ్లలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారట. ఈ క్రమంలోనే ఇలా కేసీఆర్ చేవెళ్లలో మాత్రమే కాదు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరిన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాగా కేసిఆర్ ఇలా రంగంలోకిదిగి అటు పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ద్వారా.. వలసల పర్వాన్ని ఆపగలుగుతారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏం జరుగుతుందో చూడాలి మరి. అయితే ఇప్పటికే తెలంగాణ సాధన కోసం పోరాడిన కేసీఆర్.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ఆగేలా సొంత పార్టీనీ కాపాడుకోవడం కోసం పోరాడేందుకు సిద్ధమవుతున్నారట .

మరింత సమాచారం తెలుసుకోండి: