తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా రోజుల క్రితమే మేనిఫెస్టోను ప్రకటించగా టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సూపర్ సిక్స్ స్కీమ్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఏకంగా 45000 రూపాయలు వస్తాయంటూ అమ్మఒడి స్కీమ్ ద్వారా ఊహించని స్థాయిలో మేలు జరుగుతుందంటూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.
 
వైసీపీ నవరత్నాలలో స్వల్పంగా మార్పులు చేసి మేనిఫెస్టోను ప్రకటిస్తుందని నెల రోజుల క్రితం వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మొదట సిద్ధం సభలలో జగన్ మేనిఫెస్టోను ప్రకటిస్తారని ప్రచారం జరగగా ఆ తర్వాత బస్సు యాత్రకు ముందు మేనిఫెస్టో గురించి పూర్తిస్థాయిలో ప్రకటన చేసే ఛాన్స్ అయితే ఉందని క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ ప్రచారం కూడా నిజం కాకపోవడం వైసీపీ శ్రేణులను బాధ పెడుతోంది.
 
మరోవైపు నవరత్నాలలో భాగంగా వైసీపీ అమలు చేసిన అద్బుతమైన పథకాలలో వైఎస్సార్ చేయూత ఒకటి. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలకు నాలుగేళ్ల పాటు బెనిఫిట్ కలగాలనే ఆలోచనతో ఈ స్కీమ్ ను అమలు చేయడం జరిగింది. ఈ స్కీమ్ ను మళ్లీ అమలు చేసినా లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో ఉండరు కాబట్టి ఈ పథకం వల్ల పెద్దగా లాభం ఉండదని చెప్పవచ్చు.
 
జగన్ మేనిఫెస్టో దిశగా వేగంగా అడుగులు వేయాలని ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందని గమనించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి మేనిఫెస్టోను ప్రచారం చేయడం ఆ సమయంలో వైసీపీకి కలిసొచ్చింది. ఏపీలో ఎన్నికలకు కేవలం 40 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో తప్పటడుగులు వేస్తే మాత్రం జగన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జగన్ రైతు రుణమాఫీ, ఇతర హామీలను ప్రకటిస్తారని చాలామంది రైతులు ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకుంటారో వమ్ము చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: