ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యర్థుల మధ్య హిట్ రోజు రోజుకు పెరుగుతుంది. ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ మరియు కూటమి వ్యక్తులు ఒకరిపై ఒకరు తీవ్ర వాద ప్రతివాదములు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఇన్ని రోజులపాటు రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యల గురించి వైసీపీ, కూటమి అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు  తాజాగా వాలంటీర్ల సమస్య తెరపైకి వచ్చింది.

కొన్ని రోజుల క్రితమే ఎలక్షన్లకు వాలంటీర్లు దూరంగా ఉండాలి అని ఈసీ స్పష్టం చేసింది. దానితో పెన్షన్లు అందడం లేట్ అయింది. ఇక వాలంటీర్ వ్యవస్థ పై ఈసీకి చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేయడం వల్లే పెన్షన్లు ఆలస్యం అయ్యాయి అని దాని వల్ల కొంత మంది మరణించారు అని వాటికి చంద్రబాబు అండ్ కో కారణం అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇక దీనిపై కూటమి సభ్యులు ప్రత్యామ్నాయలు చేయడంలో విఫలమై తమపై నిందలేస్తారా..? మీకు చేతకాక మమ్మల్ని అంటారా..? అని ప్రశ్నించింది.

ఇలా వాలంటీర్ల విషయంలో ఇరు వర్గాలు తీవ్రవాద ప్రతి వాదనలు చేసుకుంటున్న సమయంలో చంద్రబాబు మేము గనక అధికారంలోకి వచ్చినట్లు అయితే వాలంటీర్లకు పది వేల జీతం పెంచుతాము అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రజలకు ఎంతో  సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని తాజాగా ఆయన స్పష్టం చేశారు.  వాలంటీర్ల జీతం  రూ.10 వేలకు పెంచుతామన్న చంద్రబాబు హామీపై పేర్ని నాని తాజాగా స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేయాలని చంద్రబాబు భావించారు. అది కుదరకపోయేసరికి ఇప్పుడు వారిపై ఇప్పుడు ఎక్కడలేని ప్రేమని చూపిస్తున్నాడు అని ఆరోపించారు.

ఎవరూ కూడా చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని సూచించారు. ఈ స్థాయిలో వారికి జీతం పెంచుతాను అని అన్నాడు అంటే అది వాలంటీర్‌ వ్యవస్థ సక్సెస్‌ కి నిదర్శనం అని నాని అన్నారు. వాలంటీర్లు రెండున్నర లక్షల మంది ఉన్నారు. వారంతా తన సైన్యంగా గతంలోనే జగన్ చెప్పారు. అదే వాలంటీర్లు ఇప్పుడు టీడీపీ చాలా కీలకమైనట్లు తెలుస్తోంది. మరోవైపు వాలంటీర్ల రాజీనామాలు కూడా భారీగా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: