శనివారం సాయంత్రం విజయవాడలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక అగంతకుడు రాళ్ల దాడి చేశాడు. ఈ రాళ్ల దాడి భారతదేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయ్యింది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్ల దాడి జరిగింది. ఈ వరుస సంఘటనలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. ఈ దాడుల్లో జగన్, వెల్లంపల్లి గాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎస్కేప్ అయ్యారు.

అయితే జగన్ రాయి దాడిపై చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ చాలా అమానుషంగా ప్రవర్తించింది. "ఆయనే కావాలనే చేయించుకున్నాడు. ఇదంతా బూటకం, నాటకం" అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కొంచెం కూడా కనికరం చూపించకుండా టీడీపీ వాళ్లు ప్రవర్తించిన తీరు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల్లో ఆగ్రహావేశాలకు దారితీసింది. కోడి కత్తి ఒక డ్రామా ఇది కూడా అలాంటి మరో డ్రామా అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. టిడిపి శ్రేణులు మొత్తం కూడా ఇలానే స్పందించారు. ఒక మనిషి పై దాడి జరిగితే దానిని ఖండించి, సానుభూతి చూపించాల్సింది పోయి విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది తప్పుపట్టారు.

బాబు పై కూడా రాళ్ల దాడి జరిగింది కానీ జగన్ కి తప్ప ఈ దాడుల్లో ఎవరికీ దెబ్బ తగలలేదు దాన్ని బట్టి చూస్తుంటే టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు కావాలనే ఈ రాళ్ల దాడులను చేయించుకుని ఉంటారనే ఒక అనుమానం ప్రజల్లో మొదలయ్యింది. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు రాళ్ల దాడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. వీరు ఆ పని ఎందుకు చేశారనేది ఇంతవరకు తెలియ రాలేదు. జగన్ పై దాడి జరిగింది కాబట్టి ఆయనకు సింపతీ పెరిగే అవకాశం ఉంది ఆ సింపతీ అలానే ఉండిపోకుండా వెంటనే పోగొట్టేలా చంద్రబాబు తనపై తానే రాళ్ల దాడి చేయించుకున్నారని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనలన్నీ షాకింగ్ గా, అలాగే హాస్యాస్పదంగా మారాయి.

ఇకపోతే జగన్ ఈ ఘటన తర్వాత తన భద్రతను పెంచుకున్నారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: