సాధారణంగా రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంది అంటే ఇక ఏ ఎన్నికలు  వచ్చిన సరే ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు కాస్త ఎక్కువగానే ఉంటారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఇదే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాకి రాగానే కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి. అయితే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  ఇప్పటికే అన్ని స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ ఖమ్మం కరీంనగర్ స్థానాల నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.


 దీంతో టికెట్ తమకే వస్తుంది అంటూ ఎంతో మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టికెట్ కేటాయింపు విషయంలో నెలరోజుల నుంచి కసరత్తు జరుగుతుండగా.. ఇక ఇప్పుడు ఈ కసరత్తు క్లైమాక్స్ కి చేరుకుంది అన్నది తెలుస్తోంది. టికెట్ కోసం పోటీ పడుతున్న ముగ్గురు మంత్రుల మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగిందట. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం అయ్యారట.


 ఇందులో భాగంగానే ఇక ఈ ఖమ్మం స్థానం పంచాయతీ కర్ణాటక వరకు వెళ్లడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా రంగంలోకి దిగి పొంగులేటి, భట్టితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మెంబర్స్ ని పక్కన పెట్టాలని అధిష్టానం సూచించడంతో ఇక నాగేశ్వరరావు పేరును బట్టి విక్రమార్క, రఘురాం రెడ్డి పేరును పొంగులేటి ప్రపోస్ చేశారట.  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు  రఘురాం రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అధిష్టానం ఇప్పటికే అతని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేసి ఖర్గే ఆయన నుంచి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారట. ఫైనల్ గా రఘురాంరెడ్డిని ఖరారు చేశారని.. మరికొన్ని గంటల్లో ఇక ఇందుకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: