ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో.. అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లు.. నిత్యం ఆరోపిస్తోంది చంద్రబాబు సర్కార్. అదే సమయంలో వైసీపీ నేతల పై కేసులు పెట్టి... వాళ్లను టార్చర్ పెడుతోంది. అడుగడుగునా అరెస్టులు కూడా చేస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసింది టిడిపి కూటమి ప్రభుత్వం.

 

అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీలో నామినేటెడ్ పోస్టులపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ వారికి.. పదవులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయ్యారు అంట. భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ అలాగే... తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేతలను దృష్టిలో పెట్టుకొని ఈ పదవులను పంచాల్సి ఉంటుంది.


దింతో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి నేపథ్యంలో ఏపీ నామినేటెడ్ పోస్టుల కోసం టిడిపి పార్టీ నుంచే 23 వేల దరఖాస్తులు వచ్చాయట. దీంతో టిడిపి అగ్ర నేతలు తలలు పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలలో నామినేటెడ్ పదవుల కోసం సుమారు 23 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి.

 తెలుగుదేశం కార్యకర్తల్లో అసంతృప్తి కలగకుండా ఈ వారంలో తొలి జాబితా ప్రకటించేందుకు కూడా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ఏపీలో పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన 31 మంది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్య క్షు లు అలా గే ఇన్చార్జిలకు ఇందులో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచిన వారికి కూడా పదవులు దక్కి అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: