గత కొద్దిరోజులుగా విశాఖ మేయర్ పదవి పైన అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ రోజున విశాఖ మేయర్ కార్పొరేషన్ పీఠాన్ని సైతం కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నది. ఈరోజు ఉదయం 11 గంటలకు  విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ పైన అవిశ్వాస కౌన్సిలర్ సమావేశం కూడా జరిగింది. GVMC ఇన్చార్జి కమిషన్, అలాగే కలెక్టర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగగా కూటమి నుంచి 74 మంది సభ్యులు హాజరు అయ్యారు.


ఇందులో అవిశ్వాస తీర్మానానికి కూడా కూటమికి అనుకూలంగా 74 మంది సభ్యులు ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో జీవీఎంసీ మేయర్ గోలగాని హరివెంకట కుమారి పైన అవిశ్వాస తీర్మానం నుండి కూటమి ప్రభుత్వం నెగ్గింది. దీంతో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఖాతాలో చేరింది. నాలుగేళ్ల తర్వాత పాలన సమీక్షించుకునేందుకే అవకాశం చట్టం కల్పించారని ఈ తొమ్మిది నెలల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు మారలేదని.. ఎవరు కూడా ఒత్తిళ్లకు గురి చేయలేదని గత ప్రభుత్వం ఎలా చేసిందో ఇప్పుడు కూడా అలాగే చేసి గెలిచామంటూ అక్కడి కూటమి నేతలు  తెలియజేస్తున్నారు.


చివరి క్షణంలో కూటమిలోకి కొంత మంది చేరి మ్యాజిక్ ఫిగర్ ని సరి చేయడమే కాకుండా వైసిపి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేల వారసులు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గెలిచేలా చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో రేపటి రోజున కొత్త మేయర్ ని సైతం ఎంచుకోబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఈ సమావేశానికి వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు బహిష్కరించినట్లుగా తెలియజేశారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంతో తెలుగు తమ్ముళ్లతో పాటు కూటమి నేతలు కార్యకర్తలు కూడా ఆనందపడుతున్నారు. మరి వీటి పైన వైసిపి పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: